twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మరణం తర్వాత కూడా తీరని వివేక్‌ చివరి కోరిక.. అభిమానులకు షాక్ ఇచ్చిన స్టార్ దర్శకుడు

    |

    దక్షిణాదిలో ప్రముఖ హాస్య నటుడు, సామాజిక కార్యకర్త, పద్మశ్రీ వివేక్ ఇటీవల గుండెపోటుతో మరణించడం సినీ లోకాన్ని విషాదంలోకి నెట్టింది. వివేక్ లేని లోటు పూడ్చలేనిది. ఆయన ఆత్మకు శాంతి కలగాలి అని ప్రతీ ఒక్కరు భగవంతుడిని కోరుకొన్నారు. అయితే ఆయన నటించిన ఇండియన్ 2 సినిమా వివాదంలో ఇరుక్కుపోయి కోర్టు బోనులో చిక్కుకొన్నది. ఈ సందర్భంగా దర్శకుడు శంకర్ చేసిన వాదన ఆసక్తిగా మారడమే కాకుండా వివేక్ కోరిక తీరని పరిస్థితి ఏర్పడింది. ఇండియన్ 2 వివాదంలోకి వెళితే..

    30 రోజుల్లో ప్రేమించడం ఎలా హీరోయిన్ ఫోటోషూట్ వైరల్.. సరికొత్త అందాలతో

    వివేక్‌కు తీరని కోరిక

    వివేక్‌కు తీరని కోరిక

    తన సుదీర్ఘమైన సినీ కెరీర్‌లో వివేక్ ఎందరో సూపర్‌ స్టార్స్‌తో నటించారు. రజనీకాంత్, విక్రమ్ లాంటి హీరోల పక్కన నటించినా.. విలక్షణ నటుడు కమల్ హాసన్‌తో నటించే అవకాశం దక్కలేదు. చిట్టచివరకు శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఇండియన్ 2 చిత్రంలో కమల్ పక్కన నటించే ఛాన్స్‌ సొంతం చేసుకొన్నారు.

     ఇండియన్‌2‌లో కమల్ హాసన్ పక్కన వివేక్

    ఇండియన్‌2‌లో కమల్ హాసన్ పక్కన వివేక్

    ఇండియన్ 2 చిత్రంలో కమల్‌ హాసన్ పక్కన కమెడియన్ వివేక్ కొన్ని సీన్ల నటించారు. మరికొన్ని కీలక సన్నివేశాలను ఇంకా చిత్రీకరించాల్సి ఉంది. కానీ అనుకొని కారణాల వల్ల ఇండియన్ 2 చిత్రం షూటింగ్ అర్ధాంతరంగా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో ఇండియన్ 2 సినిమా పక్కన పెట్టి రాంచరణ్‌తో సినిమాను పట్టాలెక్కించే ప్రయత్నం చేయగా.. ఇండియన్ 2 చిత్రాన్ని పూర్తి చేయకుండా మరో సినిమా చేయడం వీలు లేదంటూ లైకా ప్రోడక్షన్ కోర్టులో కేసు వేశారు.

     ప్రశ్నార్థకంగా వివేక్ సీన్లు..

    ప్రశ్నార్థకంగా వివేక్ సీన్లు..

    మద్రాస్ హైకోర్టులో జరిగిన విచారణలో శంకర్ తరఫు న్యాయవాది తమ వాదనలు వినిపిస్తూ.. ఈ సినిమాకు సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి. అందులో వివేక్‌కు సంబంధించిన సీన్లు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారాయి. ఆయన మరణం తర్వాత ఆ సీన్లను తొలగించి.. మరో నటుడితో రీషూట్ చేయాల్సి వస్తున్నది అంటూ కోర్టుకు వెల్లడించారు.

     హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

    హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

    ఇండియన్‌ 2 సినిమాకు సంబంధించి శంకర్‌పై లైకా ప్రొడక్షన్ దాఖలు చేసిన పిటిషన్‌‌పై మద్రాస్ హైకోర్టులో వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు.. ఈ వివాదంపై ఇరు పార్టీలు ఏదో విధంగా రాజీకి రావాలి. ఆ సినిమా విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని కోర్టు సూచించింది. ఈ కేసు విచారణను ఏప్రిల్ 28వ తేదీకి వాయిదా వేశారు.

    Recommended Video

    Actor Vivek మరణం: కంటతడి పెట్టిన Keerthy, త్రిష, సూర్య, ఈ తరం హాస్యనటుల్లో ఆ లక్షణాలు లేవు
    తీరని వివేక్ చిరకాలపు కోరిక

    తీరని వివేక్ చిరకాలపు కోరిక

    తాజా కోర్టు విచారణ, శంకర్ తరఫు న్యాయవాది చేసిన వాదనతో వివేక్ చిరకాల కోరిక ప్రస్తుత పరిస్థితుల్లో కష్టంగా మారింది. మరణానికి ముందు కమల్ హాసన్‌తో నటించాలని కోరిక తీరుతుందని వివేక్ భావించారు. కానీ ఏప్రిల్ 17వ తేదీన ఆకస్మిక మరణం సంభవించడం వివేక్ కల కలగానే మిగిలే పోయే విధంగా మారింది. ఈ చిత్రంలో వివేక్ సన్నివేశాలు తొలగించాలని దర్శకుడు శంకర్ నిర్ణయం తీసుకోవడం వివేక్ అభిమానులకు దిగ్బ్రాంతికరంగా మారింది.

    English summary
    Director Shankar clarity to Madras High Court over Indian 2 movie, which case filed by Lyka Productions. As per latest aruguments, Director given clarity about the few scenes. As per reports, Vivek's Combination scenes with Kamal Haasan from Indian 2 will be removed, and shot with another Actor.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X