నన్ను రెండో పెళ్లి చేసుకొంటావా? ప్రముఖ నటుడి భార్యకు నెటిజన్ షాక్
సోషల్ మీడియా బలంగా మారినప్పటి నుంచి సెలబ్రిటీలకు చేదు అనుభవాలు ఎక్కువగానే ఎదురువుతున్నాయనే విషయం తెలిసిందే. ట్విట్టర్, ఇన్స్‌టాగ్రామ్, ఫేస్‌బుక్‌ను ఆసరాగా చేసుకొని సినీ తారలను, హీరోలను ట్రోల్ చేయడం పరిపాటిగా మారింది. తాజాగా నెటిజన్ల ట్రోల్స్‌తో ఓ హీరో భార్య చేదు అనుభవాన్ని ముటగట్టుకొన్నది. ఆ వివరాల్లోకి వెళితే...

లవ్ మ్యారేజ్‌తో వీజే అంజనా
తమిళంలో విభిన్నమైన పాత్రలతో ఆకట్టుకొంటున్న నటుడు కాయల్ చంద్రన్. 2015లో వీజే అంజనాతో ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత 2016లో వారిద్దరూ వివాహం చేసుకొన్నారు. ఇటీవలే చంద్రన్, అంజనా ఐదో వివాహ వార్షికోత్సవం జరుపుకొన్నారు.

సెకండ్ మ్యారేజ్ చేసుకొంటావా?
తాజాగా వీజే అంజనా తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తన అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా అత్యుత్సాహం ప్రదర్శించిన బాలాజీ అనే అభిమాని తనకు పెళ్లి ప్రపోజల్ చేశాడు. ఐ లవ్ యూ.. నన్ను రెండోసారి పెళ్లి చేసుకొంటావా? అంటూ ప్రశ్నించారు. దాంతో ఆమె చాలా తెలివిగా ఆ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
నీ అడ్రస్ చెప్పమని నా భర్త అంటూ
నెటిజన్ వేసిన ప్రశ్నకు వీజే అంజన సమాధానం ఇస్తూ.. బాలాజీ నీవు.. చేసిన ప్రపోజల్‌ను నా భార్తకు చెప్పాను. నీవు పెళ్లి చేసుకొంటావనే ప్రపోజల్ గురించి చెబితే ఆయన సరే అన్నారు. బాలాజీ అడ్రస్ తెలుసుకో.. నిన్ను కొరియర్‌లో ప్యాక్ చేసి పంపిస్తానని చెప్పాడు. నా వల్ల ఎదురయ్యే ఒత్తడిని తప్పించుకోవడానికి నన్ను వదలేసేందుకు సిద్దంగా ఉన్నారు అని నెటిజన్‌కు అంజనా చెప్పింది.

వీజే అంజనా కెరీర్ ఇలా
వీజే అంజనా విషయానికి వస్తే.. 2008లో మిస్ చెన్నైగా గెలుపొందారు. తమిళ టెలివిజన్ ఇండస్ట్రీలో ఆమె టాప్ యాంకర్, హోస్ట్‌ా కొనసాగుతున్నారు. మొదటి సంతానం తర్వాత ఆమె ప్రొఫెషన్‌కు దూరంగా ఉంటున్నారు. ఇటీవల జూనియర్ సూపర్ స్టార్ ప్రొగ్రాంకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.


Click it and Unblock the Notifications











