వీజే చిత్ర మృతి: కాబోయే భర్తకు బిగుస్తున్న ఉచ్చు.. సీసీటీవీ ఫుటేజీలో..

తమిళనాడులో టెలివిజన్ నటి, హోస్ట్ వీజే చిత్ర మరణంపై అనుమానాలు పెరుతూనే ఉన్నాయి. అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడంతో ఇప్పుడు అందరి చూపు కాబోయే భర్తపైనే ఉంది. మంగళవారం రాత్రి చెన్నై పరిసర ప్రాంతంలోని హోటల్‌లో వీజే చిత్ర మరణించడం అభిమానులను, సినీ ప్రముఖులను దిగ్బ్రాంతికి గురిచేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ కేసులో ఇప్పటికే పోలీసులు రంగంలోకి దిగి పలువురిని ప్రశ్నించారు. ఇంకా ఈ కేసులో ఏం జరుగుతున్నదంటే..

వీజే చిత్ర దాడి తర్వాతే మరణం అంటూ

వీజే చిత్ర దాడి తర్వాతే మరణం అంటూ

చెన్నై శివారులోని ఓ హోటల్‌లో వీజే చిత్ర అనుమానాస్పద పరిస్థితుల్లో బాత్రూంలో చీరతో ఉరివేసుకొని మరణించడంపై ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కూతురు మరణానికి ముందు ఆమెపై దాడి జరిగి ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన కూతురు మరణం వెనుక కారణాలను వెల్లడించాలని పోలీసులను కోరారు.

 ఆత్మహత్యా? హత్యనా?

ఆత్మహత్యా? హత్యనా?

వీజే చిత్ర మరణించి రెండు రోజులకుపైగా అయినప్పటికి.. ఆమె మరణం ఆత్మహత్యా? హత్యానా అనే విషయాన్ని పోలీసులు స్పష్టం చేయలేకపోయారు. ఈ క్రమంలో కాబోయే భర్త హేమంత్ కుమార్‌పై అనుమానాలు పెరిగిపోయారు. దాంతో నాజెరెత్ పేట్ పోలీసులు రెండో రోజున పలు కోణాల్లో హేమంత్‌ను ప్రశ్నించారు.

సీసీటీవీ ఫుటేజ్‌పై పోలీసుల నజర్

సీసీటీవీ ఫుటేజ్‌పై పోలీసుల నజర్

డిసెంబర్ 4న హేమంత్, వీజే చిత్ర ఉన్న హోటల్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌లో అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఆ రోజుల్లో హోటల్‌కు వచ్చిన ప్రతీ ఒక్కరిని పిలిచి ప్రశ్నిస్తున్నారు. హోటల్ మేనేజ్‌మెంట్‌కు సమన్లు జారీ చేసి ప్రశ్నిస్తున్నారు

Recommended Video

తమిళ నటి VJ Chitra ఇక లేరు | Pandian Stores తో భారీ క్రేజ్..!!
వీజే చిత్ర సైకాలజీ స్టూడెంట్

వీజే చిత్ర సైకాలజీ స్టూడెంట్

ఇదిలా ఉండగా, వీజే చిత్ర గురించి ఆమె స్నేహితులు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. వీజే చిత్ర సైకాలజీ స్టూడెంట్. మానసికంగా బాధపడే పలువురికి ఆమె కౌన్సిలింగ్ ఇచ్చి మామూలు మనుషులుగా చేశారు. చాలా మంది సూసైడ్ చేసుకోవాలనుకొన్న వారిని ఆ ప్రయత్నాన్ని మాన్పించారు. ప్రస్తుతం వీజే మరణాన్ని చూస్తే ఆమెపై ఏదో దాడి జరిగి ఉండవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X