టీవీ నటి చిత్ర మరణంపై అనుమానాలు.. మెడ, దేహంపై గాట్లు.. సూసైడ్ కాదంటూ తండ్రి పిటిషన్
ప్రముఖ నటి, టెలివిజన్ హోస్ట్ వీజే చిత్ర అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె మరణం వెనుక బలమైన కారణం ఉందనే, ఆమెది ఆత్మహత్య కాదనే వాదనను కుటుంబ సభ్యులు బయటపెట్టారు. ఈ మేరకు చెన్నైలోని ఓ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో చిత్ర మరణం కేసులో దర్యాప్తు మరో మలుపు తిరిగింది. ఈ వివరాల్లోకి వెళితే..

చెన్నైలోని నాజ్రేత్ పేట్‌లోని హోటల్‌లో
డిసెంబర్ 9వ తేదీ అర్ధరాత్రి చెన్నై శివారులోని నాజ్రేత్‌పేట్‌లోని ఒక హోటల్‌లోని బాత్రూంలో ఉరివేసుకొని మరణించిన వార్త దక్షిణాది మీడియాలో సంచలనం రేపింది. తొలుత ఆమె మరణాన్ని ఆత్మహత్యగానే భావించారు. సంఘటనా స్థలానికి చేరుకొన్న కుటుంబ సభ్యులు అనేక అనుమానాలు వ్యక్తం చేయడంతో ఈ కేసు యూటర్న్ తీసుకొన్నది.

గొంతు నులిమి చంపి ఉంటారనే..
ప్రాథమిక సమాచారం ప్రకారం.. వీజే చిత్ర మరణానికి ముందు ఎవరితోనో ఘర్షణ పడి ఉంటారు. వారే ఆమెను గొంతు నులిమి చంపి ఉంటారు. ఆమె మెడ చుట్టు, బుగ్గలపై వేలిగాట్లు, అలాగే ఆమె దేహంపై గాయాలు ఉన్నాయి అనే విషయం బయటకు వచ్చింది. దీంతో ఆమె మరణానికి ముందు ఆమెపై దాడి జరిగి ఉండవచ్చనే అనుమానం వ్యక్తమవుతున్నది.

డిసెంబర్ 4వ తేదీ నుంచి హోటల్‌లోనే
గత కొద్దికాలంగా తన కుటుంబ సభ్యులు, కాబోయే భర్త హేమంత్ కుమార్‌తో గొడవలు అవుతుండగా.. డిసెంబర్ 4వ తేదీ నుంచి ఆమె హోటల్‌లో ఉంటున్నారు. ఇటీవల తన తల్లితో గొడవ పడటం, అలాగే హేమంత్ కుమార్‌తో అభిప్రాయ బేధాలు వచ్చాయి అన సన్నిహితులు వెల్లడిస్తున్నారు. గొడవల కారణంగానే తిరువాన్‌మియూర్‌లోని తన తల్లి ఇంటి నుంచి బయటకు వచ్చారని తెలిపారు.

నా కూతురి మృతిపై పలు అనుమానాలు
ఇదిలా ఉండగా, చిత్ర తండ్రి కామరాజ్ నజ్రెత్‌పేట్ పరిధిలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన కూతురు మరణంపై అనేక అనుమానాలు ఉన్నాయి. కాబట్టి ఆ దిశగా దర్యాప్తు చేపట్టాలని చిత్ర తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. కామరాజ్ పిటిషన్ దాఖలుతో ఈ కేసు దర్యాప్తులో మార్పులు జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నది.
Recommended Video

వ్యక్తిగతంగా ఎవరిపై అనుమానాలు లేవు..
వ్యక్తిగతంగా తమకు ఎవరిపై అనుమానాలు లేవు. కానీ తన తండ్రి ఇలాంటి తీవ్రమైన నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలపై అనేక అనుమానాలు ఉన్నాయి అని వీజే చిత్ర తండ్రి కామరాజ్ తన ఫిర్యాదులో పేర్కొన్నట్టు సమాచారం. దాంతో ఈ కేసును సూసైడ్‌గా కాకుండా అనుమానాస్పద మరణంగా నమోదు చేసే ఆలోచనలో ఉన్నారు.


Click it and Unblock the Notifications











