Just In
- 6 min ago
భర్త చేసిన పనికి అప్పుడే కన్నీళ్లు పెట్టుకున్న నిహారిక.. ఏకంగా వీడియో రిలీజ్ చేసి..
- 38 min ago
మళ్లీ ప్రేమలో పడ్డ శృతి హాసన్: అతడితో అయిపోయిందంటూ.. పుసుక్కున నోరు జారి బుక్కైంది
- 1 hr ago
RRR నుంచి అదిరిపోయే అప్డేట్: గుడ్ న్యూస్ చెప్పిన ఎన్టీఆర్, చరణ్.. వాళ్లిచ్చే సర్ప్రైజ్ అదే!
- 3 hrs ago
హాలీవుడ్ చిత్రం గాడ్జిల్లా vs కాంగ్ ట్రైలర్ విడుదల: తెలుగుతో పాటు ఆ భాషల్లో కూడా వదిలారు
Don't Miss!
- News
ఏపీలో టెన్షన్, టెన్షన్- మొదలుకాని నామినేషన్లు- ఎస్ఈసీ ఆఫీసులోనే నిమ్మగడ్డ
- Sports
ఇంగ్లండ్ అలా చేయకుంటే భారత్‌ను అవమానపరిచినట్టే.. జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్ల ఫైర్!
- Finance
భారీ లాభాల నుండి, భారీ నష్టాల్లోకి: రిలయన్స్ మహా పతనం
- Lifestyle
జనన నియంత్రణ ఉన్నప్పటికీ గర్భం వచ్చే ప్రమాదం
- Automobiles
ఇదుగిదిగో.. కొత్త 2021 ఫోర్స్ గుర్ఖా; త్వరలో విడుదల, కొత్త వివరాలు వెల్లడి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
నటి చిత్ర మరణానికి కొన్ని క్షణాల ముందు.. హోటల్ గదిలో ఏం జరిగిందంటే.. కాబోయే భర్త షాకింగ్ కామెంట్స్!
తమిళ చిత్ర పరిశ్రమలో పాపులర్ టీవీ నటి, హోస్ట్ వీజే చిత్ర మరణ వార్తతో సినీ అభిమానులు, ఆమె ఫ్యాన్స్ విషాదంలో మునిగిపోయారు. బుధవారం ఉదయమే వీజే చిత్ర మరణవార్త కోలీవుడ్‌ను కుదిపేసింది. అయితే బుధవారం తెల్లవారు జామున హోటల్ గదిలో జరిగిన విషయాలను కాబోయే భర్త హేమంత్ కుమార్ చెప్పిన తీరు సంచలనం రేపుతున్నాయి. హేమంత్ చెప్పిన విషయాలు ఇలా ఉన్నాయి..

ఆగస్టులో ఎంగేజ్‌మెంట్.. అక్టోబర్‌లో సీక్రెట్‌గా
2020 ఆగస్టులో వీజే చిత్ర, హేమంత్ కుమార్‌కు వివాహ నిశ్చితార్థం జరిగింది. ఆ తర్వాత సీక్రెట్‌గా వారిద్దరూ అక్టోబర్ 19వ తేదీన రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొన్నారు. అంతకుముందు చిత్ర తన సోషల్ మీడియాలో స్పందిస్తూ.. త్వరలోనే నా పెళ్లి కాబోతున్నది. పెళ్లికి కావాల్సిన డాక్యుమెంట్లను రిజిస్టర్ ఆఫీస్‌లో నా కాబోయే భర్త సమర్పించారు అని తెలిపింది. కానీ సీక్రెట్‌గా చేసుకొన్నట్టు భావిస్తున్న తమ పెళ్లిని ఇప్పటి వరకు గోప్యంగానే ఉంచడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

మరణానికి ముందు వరక బీజీగా షూటింగ్‌తో
విజే చిత్ర బుధవారం రోజంతా బిజీబిజీగా తన జీవితనాన్ని గడిపింది. చెన్నైలోని ఈవీపీ స్టూడియోస్‌లో జరిగిన షూటింగులో పాల్గొన్న ఆమె తెల్లవారు జామున ఒంటిగంట ప్రాంతంలో హోటల్‌కు చేరుకొన్నారు. ఆ తర్వాత తన కాబోయే భర్త హేమంత్ కుమార్‌తో గదిలో ఉన్నారు. గత కొద్దికాలంగా హేమంత్, చిత్ర అదే హోటల్‌లో ఉంటున్నారు.

అర్ధరాత్రి తర్వాత హోటల్‌కు..
వీజే చిత్ర మరణం తర్వాత చెన్నై పోలీసుల విచారణలో హేమంత్ కుమార్ కొన్ని విషయాలు వెల్లడిస్తూ.. షూట్ నుంచి అర్ధరాత్రి హోటల్‌కు వచ్చింది. ఏదో మానసికంగా సరిగా ఉన్నట్టు కనిపించలేదు. డిప్రెషన్‌లో ఉన్నట్టు కనిపించింది. స్నానానికి వెళ్తున్నట్టు చెప్పి బాత్రూంలోకి వెళ్లింది. కానీ వెంటనే తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చింది. పిలిస్తే పలకలేదు. దాంతో హోటల్ సిబ్బందిని పిలిచాను అని హేమంత్ కుమార్ తెలిపారు.

బాత్రూంలోకి వెళ్లిని చిత్ర.. ఆ తర్వాత
తన అరుపులు, కేకలతో హోటల్ సిబ్బంది వెంటనే గదిలోకి చేరుకొన్నారు. మరో తాళంతో వారు బాత్రూం డోర్‌ను తెరిచారు. ఆ సమయంలో తన చీరతో ఉరి వేసుకొని విగత జీవిగా కనిపించింది. తాను ఇలాంటి తీవ్రమైన నిర్ణయం తీసుకోవడం వెనుక కారణమేంటో తెలియడం లేదు అంటూ హేమంత్ కుమార్ పోలీసులతో అన్నట్టు తెలిసింది.

నా కూతురు చాలా బోల్డ్.. సూసైడ్ అంటే నమ్మను
వీజే చిత్ర మరణంపై తల్లి అనుమానాలు వ్యక్తం చేస్తున్నది. తన కూతురు చాలా ధైర్యవంతురాలు. చావుకు భయపడని వ్యక్తి. ఎలాంటి సమస్యనైనా ధీటుగా ఎదుర్కొంటుంది. ఇలా సూసైడ్ చేసుకొన్నారంటే నమ్మలేం అని అన్నారు. చిత్రపై ఎవరో దాడి చేసి చంపి ఉంటారనే అనుమానాన్ని ఆమె వ్యక్తం చేస్తున్నారు.