వీజే చిత్ర మరణం కేసు‌లో మద్రాస్ కోర్టు సంచలన నిర్ణయం.. భర్తకు ఏం జరిగిందంటే!

పాండ్యన్ స్టోర్ టెలివిజన్ సీరియల్‌తో అత్యంత పాపులారిటీని సంపాదించుకొన్న వీజే చిత్ర మరణం తమిళ ప్రేక్షకులను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. చిత్ర మరణం తర్వాత తమిళ మీడియాలో సంచలన కథనాలు వచ్చాయి. అయితే ఈ కేసులో భర్త హేమంత్‌ను పోలీసులు అరెస్ట్ చేయడం తెలిసిందే. ఈ కేసు వివరాల్లోకి వెళితే...

డిసెంబర్ 9వ తేదీన

డిసెంబర్ 9వ తేదీన

2020 డిసెంబర్ 9వ తేదీ అర్ధరాత్రి చెన్నై శివారులోని నాజ్రేత్‌పేట్‌లోని ఓ హోటల్‌లోని బాత్రూంలో ఉరివేసుకొని మరణించిన వార్త దక్షిణాది మీడియాలో సంచలనం రేపిన విషయం తెలిసిందే. తొలుత ఆమె మరణాన్ని ఆత్మహత్యగానే భావించారు. సంఘటనా స్థలానికి చేరుకొన్న కుటుంబ సభ్యులు అనేక అనుమానాలు వ్యక్తం చేయడంతో ఈ కేసు యూటర్న్ తీసుకొన్నది. ఈ కేసులో అనుమానితుడు హేమంత్‌ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

చిత్ర భర్త అరెస్ట్‌తో సంచలనం

చిత్ర భర్త అరెస్ట్‌తో సంచలనం

వీజే చిత్ర అనుమానాస్పద మరణం కేసులో భర్త హేమంత్ గత రెండు నెలలుగా జైలులోనే ఉంటున్నారు. ఈ కేసులో పోలీసులు తమ కస్టడీకి తీసుకొని పలు కోణాల్లో విచారిస్తున్నారు. ఈ క్రమంలో హేమంత్ పలు మార్లు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా గతంలో కోర్టు తిరస్కరించింది.

ఎఫ్ఐఆర్ నమోదు తర్వాత

ఎఫ్ఐఆర్ నమోదు తర్వాత

గతంలో ఎఫ్‌ఐఆర్ నమోదు కాకపోవడంతో బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. 60 రోజుల గడువు తర్వాత హేమంత్ బెయిల్ కోసం అప్లై చేసుకోవాలని కోరింది. అయితే తాజాగా బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా అనూహ్యంగా కోర్టు హేమంత్‌కు మద్రాస్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

వీజే చిత్ర భర్తకు బెయిల్

వీజే చిత్ర భర్తకు బెయిల్

ప్రస్తుతం బెయిల్ లభించిన హేమంత్ త్వరలోనే జైలు నుంచి బయటకు రానున్నారు. బెయిల్‌పై రిలీజ్‌కు సంబంధించిన లీగల్ ఫార్మాలిటీస్ పూర్తి కాగానే హేమంత్ జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X