అనుష్క మెరుపుతీగలా ఉండబోతోందా? టెమ్ట్ చేస్తున్న కోన వెంకట్ ట్వీట్!

'భాగమతి' తర్వాత హీరోయిన్ అనుష్క ఏ సినిమాలోనూ నటించలేదు. ఆ మూవీ తర్వాత దాదాపు సంవత్సరం గ్యాప్ తీసుకున్న ఆమె త్వరలో కోన వెంకట్ నిర్మాణంలో వచ్చే ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ గ్యాపులో ఆమె తన ఫిజిక్, లుక్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటూ సరికొత్త అవతారంలోకి మారిపోయినట్లు తెలుస్తోంది.

చాలా రోజులుగా అనుష్క మీడియాకు కూడా చిక్క లేదు. ఆమె లుక్ ఎలా ఉంటుందో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో క్రిస్మస్ సందర్భంగా ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు కోన వెంకట్. దీంతో అభిమానుల్లో ఉత్కంఠ మరింత పెరిగింది.

ఈ లుక్ కూడా నాకు ఇష్టమే, కానీ ఇందుకు భిన్నంగా...

తన ట్విట్టర్ ద్వారా అనుష్కకు సంబంధించిన ఓ ఫోటో కోన వెంకట్ షేర్ చేశారు. అయితే ఇది అనుష్క లేటెస్ట్ లుక్ కాదు. మనం ఇప్పటి వరకు చూసిన అనష్క ఫోటోయే అది. తనకు ఈ లుక్ కూడా ఇష్టమే, కానీ... ‘మా సినిమాలో అనుష్క లుక్ విషయంలో సూపర్ ఎగ్జైటెడ్‌గా ఉన్నాం. అది ఆమె కెరీర్లోనే ది బెస్ట్ లుక్‌గా ఉండబోతోంది' అన్నారు. దీంతో త్వరగా అనుష్క లుక్ విడుదల చేయాంటూ కోన వెంకట్‌కు అభిమానుల నుంచి విజ్ఞప్తులు వెళ్లువెత్తాయి.

సన్నగా మెరుపు తీగలా ఉంటుందా?

సన్నగా మెరుపు తీగలా ఉంటుందా?

‘సూపర్' సినిమా ద్వారా అనుష్క హీరోయిన్‌గా పరిచయం అయిన సంగతి తెలిసిందే. అపుడు అనుష్క సన్నగా... మెరుపు తీగలా సెక్సీ లుక్‌తో ఆకట్టుకుంది. మళ్లీ అలాంటి లుక్‌లోకి అనుష్క మారబోతోందా? అనే ఆసక్తి అభిమానుల్లో ఎక్కువైంది.

శృంగార దేవతలా...

శృంగార దేవతలా...

విక్రమార్కుడు, బిల్లా సమయంలో అనుష్క గ్లామర్ డోస్ ఓ రేంజిలో పెంచేసింది. అభిమానులు ఆమెను శృంగార దేవతలా ఆరాధించే స్థాయికి వెళ్లింది. అప్పటి నుంచి అనుష్కకు ఫాలోయింగ్ పెరుగుతూ వచ్చింది. అనుష్కను మళ్లీ అలా చూడాలని ఆశపడుతున్న అభిమానులు చాలా మంది ఉన్నారు.

నెక్ట్స్ మూవీ వివరాలు

నెక్ట్స్ మూవీ వివరాలు

అనుష్క తర్వాతి సినిమా హేమంత్ మధుకర్ దర్శకత్వంలో రూపొందబోతోంది. తెలుగు రచయత, నిర్మాత కోన వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. అనుష్క రేంజికి తగిన విధంగా భారీస్థాయిలో ఈ సినిమా ఉండబోతోందట. గీత గోవిందం చిత్రానికి అద్భుతమైన సంగీతం అందించిన గోపీ సుందర్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X