twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మంచి కథ ఉన్నా...థియేటర్ రిలీజ్ కోసం దిక్కులు చూడాల్సిందే..ఓటీటీలపై జ్యోతిక వ్యాఖ్య

    |

    సెకండ్ ఇన్నింగ్స్ లో పవర్ ఫుల్ రోల్స్ చేస్తూ దూసుకుపోతున్న చెన్నై ఎక్స్ ప్రెస్ జ్యోతిక, తాజాగా పోన్మగల్ వందల్ అనే చిత్రంతో అలరించేందుకు సిద్ధమైంది. నేడే ఓటీటీ ప్లాట్ ఫార్మ్ పై ఈ చిత్రం విడుదలవుతోంది. ఇప్పటికే ట్రైలర్ కు మంచి స్పందన లభించడంతో, సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయ. ఈ నేపథ్యంలో, సినిమా గురించి, ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ప్రాధాన్యం గురించి జ్యోతిక చాలానే విషయాలు వెల్లడించింది. భవిష్యత్తులోనూ కథానాయిక ప్రాధాన్యం కలిగిన చిత్రాల్లోనే నటిస్తానని స్పష్టం చేసింది.

    పిల్లలపై జరుగుతున్న దౌర్జన్యకాండ

    పిల్లలపై జరుగుతున్న దౌర్జన్యకాండ

    కొన్నేళ్లుగా చిన్నారులు, మహిళపై జరుగుతున్న అరాచకాలను చూస్తూంటే గుండె రగిలిపోతుందని వెల్లడించిన జ్యోతిక, పోన్మగల్ వందల్ కథ వినగానే తన గొంతు వినిపించేందుకు ఇదే సరైన సమయమని భావించినట్లు తెలిపింది. ఓ మంచి సందేశాత్మక కథకు, థ్రిల్లర్ ను జోడించి పొన్మగల్ వందల్ రూపొదించినట్లు తెలిపింది.

    కథానాయిక ప్రాధాన్యం గల చిత్రాలకు థియేటర్లు కరువు

    కథానాయిక ప్రాధాన్యం గల చిత్రాలకు థియేటర్లు కరువు

    ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లకు పెరుగుతున్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని, ఇవి కథానాయిక ప్రాధాన్యంకలిగిన చిత్రాలకు ఎంతో ఉపకరిస్తున్నాయని జ్యోతిక పేర్కొంది. ఎంత మంచి కథతో ముందుకు వచ్చినా, మేల్ సెంట్రిక్ సినిమాల మధ్య ఫిమేల్ సెంట్రిక్ చిత్రాలు థియేటర్లలో విడుదల్వడానికి ఎన్నో సమస్యలు ఎదురవుతాయని చెప్పింది. ఓటీటీల ఆ ఇబ్బందులు తొలగనున్నాయని స్పష్టం చేసింది.

    వాదనకు ఇది సమయం కాదు

    వాదనకు ఇది సమయం కాదు

    లాక్ డౌన్ నేపథ్యంలో థియేటర్లకు తగ్గుతున్న ఆదరణపై స్పందించిన జ్యోతిక, ఈ అంశంపై వాదోపవాదాలకు ఇది సమయం కాదని స్పష్టం చేసింది. ఒకరి క్షేమం కోసం మరొకరు ఆలోచించాల్సిన సమయం ఇదేనని చెప్పిన జ్యోతిక, కాస్త సంయమనం పాటించాల్సిందిగా కోరింది.

    మరో రెండు నెలల వరకూ నో షూటింగ్

    మరో రెండు నెలల వరకూ నో షూటింగ్

    రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, మరో రెండు నెలలపాటూ ఎలాంటి షూటింగ్ లూ ఉండబోవని జ్యోతిక వెల్లడించింది. జులై నెలాఖరుకి సినీ పెద్దలు ఓ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.

    Recommended Video

    Amazon Prime : Seven Movies To Release Directly On Amazon Prime Video
     భవిష్యత్తులోనూ ఫిమేల్ సెంట్రిక్ సినిమాలే చేస్తా..

    భవిష్యత్తులోనూ ఫిమేల్ సెంట్రిక్ సినిమాలే చేస్తా..

    అవకాశం వస్తే సూర్యతో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకుంటానని తెలిపిన జ్యోతిక, లవ్ స్టోరీలు మాత్రం చేయనని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఫిమేల్ సెంట్రిక్ సినిమాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి, వాటిపైనే ఎక్కువ దృష్టి సారించనున్నట్లు తెలపింది.

    English summary
    Beautiful actress Jyothika is all set to entertain with her new film Ponmagal Vandhal, which is releasing today on a popular OTT platform. jyothika will be seen as lawyer, fighting against a gruesome child abuse case. Says OTT platforms are good for women centric films, As in theatres it is difficult to release such films admist male centric films.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X