ఫిర్యాదు వస్తే ప్రభుదేవాపై కఠిన చర్యతప్పదు..
ఫిర్యాదు రానంతవరకు ఏమీకాదు. ప్రభుదేవా భార్య రమాలత్ నుంచి ఫిర్యాదు పోలీసులకు ఇస్తే చూస్తు ఊరుకోం అని చెన్నైయ్ కమీషనర్ రాజేంద్రన్ తేల్చి చెప్పారు. ఇటీవల కాలంలో చెన్నైయ్ అంతటా వేరే న్యూస్ లేనట్టుగా నయనతార, ప్రభుదేవాల ప్రేమకలాపాలు ఆపైన రామలత్ విలాపంపై పలుకథనాలతో నిండి పోతోంది. ఇదో పబ్లిక్ న్యూసెన్సుగా ఉందని కొన్ని పత్రికలు వాపోతున్నాయి. మీడియా వార్తల ఆధారంగా చర్యలు చేపట్టాలని ఒక డిమాండు ఉండనే ఉంది. దీనిపై మీడియా స్పందించమంటే పైవిధంగా రాజేంద్రన్ చెప్పారు. ఫిర్యాదు రాకున్నా చర్యలు తీసుకోవచ్చు అని కొన్ని తమిళపత్రికలు రాస్తుంటే వీటిపై పోలీసులు తాముస్పందించేది లేదని తేల్చిచెప్పారు.
ప్రభుదేవా నయనతార రామలత రాజేంద్రన్ పోలీస్ కమీషనర్ సౌత్ స్కోప్ prabhu deva nayantara rajendran police commissioner south scope


Click it and Unblock the Notifications