అవును..అతనితోనే నా పెళ్ళి: షకీలా
భాషా భేధం లేకుండా అన్ని రాష్ట్రాల వారినీ తన సెక్సీ నటనతో ఉర్రూతలూగించిన షకీలా త్వరలో పెళ్ళి చేసుకోనుందని సమాచారం. 2010 జూన్ లో ఈ వివాహం తిరుపతి లో జరగనుంది. షకీలా కొంత కాలంగా తమిళనాడుకి చెందిన ఓ బిజెనెస్ మ్యాన్ తో ప్రేమలో ఉంది. ఈ విషయాన్ని ఆమే కన్ఫర్మ్ చేసింది. ఈ విషయమై మాట్లాడుతూ..నేను కొంతకాలంగా ఓ బిజినెస్ మ్యాన్ తో ప్రేమలో ఉన్నానన్నది నిజం. మేము జూన్ లో పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాం. అందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక ఇది ఇరు వైపులా పెద్దల అంగీకారంతో జరుగుతున్న వివాహం. ఇక అతని పేరు మిగతా వివరాలు చెప్పాలంటే ఆయన అనుమతి కావాల్సిందే అంటూ సిగ్గుపడిందామె. ఈ మ్యారేజ్ మ్యాటర్ ఆమె అభిమానులను నిరాశపరిచే విషయమే అయినా శుభాకాంక్షలు తెలుపుదాం.


Click it and Unblock the Notifications











