సూపర్ స్టార్ రజనీ చిన్న కూతురి కళ్యాణ గడియలు!
కూతుళ్ళిద్దరూ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ని ఆదర్శంగా తీసుకున్నారు. ఎందుకంటే రజనీకాంత్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. రజనీ పెద్ద కూతురు ఐశ్వర్య హీరో ధనుష్ ని ప్రేమించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంది. రజనీ చిన్న కూతురు సౌందర్య కూడా ప్రేమలో పడింది. చెన్నై ప్రముఖ పారిశ్రామికవేత్త రామ్ కుమార్ తనయుడు అశ్విన్, సౌందర్య కొంతకాలంగా ప్రేమించుకున్నారు.
కూతురు మనసును అర్థం చేసుకున్న రజనీకాంత్ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఫిబ్రవరి 14 న సింపుల్ గా నిశ్చితార్థాన్ని చేయనున్నారు. ప్రస్తుతం సౌందర్య నిర్మాతగా ఓచర్ పిక్చర్స్ బ్యానర్ పై తమిళంలో 'గోవా" అనే చిత్రాన్ని నిర్మిస్తోంది. త్వరలో పూరి జగన్నాథ్ దర్వకత్వంలో మహేష్ హీరోగా ఓ చిత్రాన్ని నిర్మించనుంది. అలాగే డాడీతో 'సుల్తాన్" అనే యానిమేషన్ చిత్రాన్ని తీస్తోంది. మొత్తానికి రజనీది 'ప్రేమ" ఫ్యామిలీ అన్న మాట!


Click it and Unblock the Notifications











