కాబోయే భర్తతో రజనీకాంత్ కూతురు సౌందర్య (వైరల్ పిక్)
సౌత్ స్టార్ రజనీకాంత్ చిన్న కూతురు సౌందర్య సెకండ్ మ్యారేజ్‌కు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆల్రెడీ చెన్నైలోని సూపర్ స్టార్ నివాసంలో పెళ్లి సందడి మొదలైంది. ఫిబ్రవరి 11న నటుడు-వ్యాపారవేత్త విశాగన్ వనంగమూడితో సౌందర్య వివాహం జరుగబోతున్న సంగతి తెలిసిందే.
తాజాగా సౌందర్య-విశాగన్ కలిసి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇద్దరి ఈడూ జోడు సూపర్‌గా ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నాయి.

ఇద్దరూ ఒకేరంగం.. రజనీ హ్యాపీ
సౌందర్య సినిమా రంగాన్నే తన కెరీర్‌గా ఎంచుకుని దర్శకురాలిగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. విశాగన్ సైతం గతేడాది వచ్చిన ‘వంజగర్ ఉలగమ్' అనే సినిమాతో నటుడిగా కెరీర్ ప్రారంభించాడు. ఇద్దరూ సినిమా రంగానికి చెందిన వారే కావడంతో... రజనీకాంత్ హ్యాపీగా ఉన్నారు.

మొదటి వివాహం అందుకే అలా...
సౌందర్య మొదటి వివాహం పారిశ్రామిక వేత్త అశ్విన్ రామ్ కుమార్‌తో 2010లో జరిగింది. 2016లో ఇద్దరూ విడిపోయారు. వీరికి వేద్ అనే కుమారుడు కూడా ఉన్నారు. ఇద్దరూ వేర్వేరు రంగాలకు చెందినవారు కావడం వల్లే వీరి వివాహం ఎక్కువ రోజులు నిలబడలేదనే అభిప్రాయాలు సైతం ఉన్నాయి.

విశాగన్‌తో కొత్త జీవితం
విశాగన్‌తో త్వరలో కొత్త జీవితం ప్రారంభించబోతున్న సౌందర్య.. అతడితో తన జీవితం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సంతోషంగా సాగుతుందనే నిర్ణయానికి వచ్చిన తర్వాతే పెళ్లికి ఓకే చెప్పిందట.. దాదాపు సంవత్సరం క్రితం ఇద్దరూ స్నేహితులుగా ప్రయాణం మొదలు పెట్టి... తమ బంధాన్ని పెళ్లి వరకు తీసుకొచ్చారని టాక్.

చెన్నై దద్దరిల్లేలా వైభవంగా వివాహం
సౌందర్య-విశాగన్ వివాహం చెన్నై నగరం దద్దరిల్లేలా ఫిబ్రవరి 11న గ్రాండ్‌గా జరుగబోతోంది. ఆల్రెడీ రజనీకాంత్ ప్రముఖులకు శుభలేఖలు పంచతుతూ బిజీగా గడుపుతున్నారు. ఈ పెళ్లి వేడుకకు తమిళనాడులోని వివిధ ప్రాంతాల నుంచి రజనీకాంత్ అభిమానులు భారీగా హాజరుకానున్నారు.


Click it and Unblock the Notifications











