Jana Nayagan Censor: జన నాయగన్ సెన్సార్ వివాదం ఏమిటి? దళపతి విజయ్ సినిమా రిలీజ్ అవుతుందా? లేదా?

తమిళ సూపర్ స్టార్, దళపతి విజయ్ నటించిన తాజా పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ జననాయగన్. తెలుగులో భారీ విజయం సాధించిన భగవంత్ కేసరి చిత్ర కథను ఆధారంగా చేసుకొని తమిళ ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా అనేక మార్పులు, చేర్పులు చేసుకొన్న ఈ సినిమాకు హెచ్ వినోద్ దర్వకత్వం వహించారు. ఈ సినిమాను కన్నడలో భారీ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ, జగదీష్ పళనిస్వామి, లోహిత్ ఎన్‌కే నిర్మించారు.

ఈ చిత్రంలో పూజా హెగ్డే, మమితా బైజు, బాబీ డియోల్, గౌతమ్ వాసుదేవన్ మీనన్, ప్రకాశ్ రాజ్, ప్రియమణి, సునీల్, రెబా మోనికా జాన్, బాబా భాస్కర్, రేవతి తదితరులు నటించారు. ఈ సిినమాకు సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫి, ప్రదీప్ ఈ రాఘవ్ ఎడిటింగ్, అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమా జనవరి 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. అయితే ఈ సినిమాలోని సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తమవ్వడం తీవ్రమైన వివాదానికి దారి తీసింది.

Controversy behind Jana Nayagan Censor Certificate

ఈ సినిమాను మొట్టమొదట డిసెంబర్ 18 తేదీన సెన్సార్ రివ్యూ కోసంసమర్పించారు. అయితే ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను, డైలాగ్స్‌ను తొలగించాలని చిత్ర యూనిట్‌కు సూచనలు, సలహాలు అందించింది. తమ సూచనలు పాటించి వాటిని తొలగించి, మార్పులు, చేర్పులు చేస్తే యూఏ 16+ సర్టిఫికెట్ జారీ చేస్తామని చెప్పింది. ఆ మేరకు చిత్ర యూనిట్ మార్పులు చేసి వారికి మళ్లీ కాపీని డిసెంబర్ 24వ తేదీన సమర్పించింది.

అయితే డిసెంబర్ 24వ తేదీన నిజాయితీగా కాపీని సమర్పించి సెన్సార్ అధికారుల స్పందన కోసం ఎదురు చూడటం ప్రారంభించారు. అయితే దాదాపు 10 రోజులపాటు ఎదురు చూసిన తర్వాత చిత్ర యూనిట్ వారిని సంప్రదించింది. అయితే జనవరి 5 తేదీన వారికి ఓ సమాచారాన్ని అధికారులు అందిస్తూ.. ఈ సినిమా రివ్యూను రివైజింగ్ కమిటీకి పంపించాం. వారి పర్యవేక్షణలో సెన్సార్ సర్టిఫికెట్ జారీ అవుతుంది అని చెప్పారు.

జన నాయగన్ సినిమా రిలీజ్ డేట్ అంటే జనవరి 9వ తేదీ దగ్గరపడటంతో చిత్ర యూనిట్, నిర్మాత మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. మాకు సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేయడంలో అనేక రకాలు జాప్యం, అభ్యంతరకరమైన కారణాలు చెబుతున్నారు అంటూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్‌ను జనవరి 6వ తేదీన విచారించేందుకు నిర్ణయం తీసుకొన్నారు. కానీ దానిని జనవరి 7వ తేదీన 2.15 నిమిషాలకు విచారిస్తామని స్పష్టం చేశారు.

దాంతో జనవరి 9వ తేదీన రిలీజ్ కావాల్సిన సమయంలో ఇంకా తమిళనాడు, ఇతర రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్ మొదలు కాలేదు. ఇతర భాషల్లో డబ్బింగ్ వెర్షన్ల సెన్సార్ కూడా పూర్తి కాలేదు. దాంతో ఈ సినిమా రిలీజ్ అవుతుందా? లేదా? అనే సందిగ్దత అందరిలోను నెలకొన్నది. ఈ సినిమా రిలీజ్ మద్రాస్ హైకోర్టు తీసుకొనే నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది అని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.

More from Filmibeat

Read more about: jana nayagan vijay sankranti2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X