వీడు హీరోనా..? అన్నవారికి రజనీ అల్లుడి షాక్!
దర్శకుడు సెల్వ రాఘవన్ తమ్ముడిగా హీరోగా తెరంగ్రేటం చేశాడు ధనుష్. బక్క పలుచని బాడీతో వీడు హీరో ఏంటిరా? అని విమర్శించిన వారికి తన టాలెంట్‌తో షాక్‌ల మీద షాక్ ఇస్తూ ముందుకు సాగుతున్నాడు. సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్యను ప్రేమ వివాహం చేసుకున్న ధనుష్ తాజగా సూపర్ స్టార్‌కు తగిన అల్లుడిగా పేరు సంపాదించుకుంటున్నాడు. ధనుష్ ఇలా దూసుకెళ్లడానికి కారణం అతను ఎంచుకుంటున్న సినిమాలే. తన నటనతో నేషనల్ అవార్డు గెలుచుకున్న ధనుష్ తాజాగా ఇటు లిరిసిస్ట్ గాను, అటు గాయకుడిగాను కేక పుట్టిస్తున్నాడు.
'మయక్కమ్ ఎన్న" చిత్రానికిగాను మూడు పాటలను స్వయంగా రచించిన ధనుష్ విమర్శల ప్రశంసలు అందుకున్నాడు. తాజాగా తన భార్య ఐశ్వర్య దర్శకత్వం వహిస్తున్న '3" అనే సినిమాలో హీరోగా నటించడంతో పాటు పాటలు కూడా రాశాడు. వీటిలో 'వై దిస్ కొలవెరిది" అనే పాటను స్వయంగా పాడి మార్కెట్ లోకి వదిలాడు. ఈ పాటకు తమిళ జనాల నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. వీడు హీరోనా? అని గతంలో ధనుష్‌ను హేళన చేసిన వారికి ఇది షాక్ కాకుంటే మరేమిటి?


Click it and Unblock the Notifications











