విక్రమ్ ‘ఐ' చిత్రం బడ్జెట్ ఎంత?

By Srikanya

చెన్నై : ప్రముఖ దర్శకుడు శంకర్ ప్రస్తుతం 'ఐ' అనే చిత్రం రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న ఈచిత్రంలో అమీ జాక్సన్ హీరోయిన్‌గా చేస్తోంది. ఈ చిత్రం బడ్జెట్ ఎంత అనేది ఇప్పటికే మీడియా సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. చెన్నై సినీ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రం దాదాపు 145 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోందని వినపడుతోంది. ఇప్పటి వరకూ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఈ రేంజి బడ్జెట్ తో ఏ చిత్రమూ తెరకెక్కలేదని,ఇదే తొలిసారని చెప్తున్నారు.

ఈ విషయాన్ని డిల్లీకి చెందిన ఓ డైలితో విక్రమ్ ఖరారు చేసి చెప్పారు. రజనీతో చేసిన రోబో కన్నా ఈ బడ్జెట్ ఎక్కువ. ఈ చిత్రం త్వరలో హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకోనుంది. ఇక్కడ ఓ పాట,కొన్ని కీలకమైన సన్నివేశాలు షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇక్కడ హైదరాబాద్ లో ఇరవై రోజులు షెడ్యూల్ వేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చెన్నై పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది.

శంకర్ చిత్రమంటేనే ప్రేక్షకులలో విపరీతమైన క్రేజ్. అందులో అపరిచితుడు కాంబినేషన్ రిపీట్ చేస్తూ చిత్రం రూపొందిస్తున్నాడంటే ఆ చిత్రం విశేషాలు తెలుసుకోవటానికి అందరకీ ఆసక్తే. ఈ నేపధ్యంలో ఈ రిపీట్ కాంబినేషన్ రూపొందిస్తున్న కొత్త చిత్రం ఐ చిత్రం కాన్సెప్ట్ పై రకరకాల కథనాలు వినపడుతున్నాయి. విక్రమ్, శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన 'అపరిచితుడు' విడుదలై ఇప్పటికి దాదాపు ఎనిమిదేళ్లు అవుతోంది.

ఆస్కార్ రవిచంద్రన్ అత్యంత భారీ ఎత్తున నిర్మిస్తున్న ఐ చిత్రం ఒలింపిక్ క్రీడల నేపథ్యంలో సాగుతుందనే సమాచారం. ఈ నేపథ్యాన్ని ఇతివృత్తంగా తీసుకుని శంకర్ ఐ చిత్రాన్ని ఓ రేంజిలో తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. ఇందులో ఒక సాధారణ యువకుడైన విక్రమ్ ఒలింపిక్‌లో బంగారు పతకం ఎలా సాధించారనేది ఐ చిత్ర కథ అని వినపడుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X