తమన్నా గురించి త్రిష ఏమంటోందంటే....
హ్యాపీ గర్ల్ తమన్నా ఎక్సట్రీమ్ సిన్సియర్, బ్రిలియంట్ అని త్రిష పొగుడుతోంది. త్రిషకు తమిళంలో పోటీ ఇస్తున్న తమన్నా గురించి ఇలా చెప్పటం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అలాగే త్రిష..తమన్నా గురించి చెబుతూ...పెద్ద స్టార్స్ తో సినిమాలు చేయటం, ఆ ఆపర్టునేటిస్ ని గ్రాబ్ చేయటంలోనే తమన్నా తెలివి ప్రూవ్ అవుతోంది అని చెప్తోంది. ఇదంతా తనకు తమిళ పరిశ్రమలో ఉన్న స్నేహితుల ద్వారా తెలిసిందని, ఈ మధ్యన బిజీగా ఉంటున్నానని ఆమె అంది. అలాగే తాను తమన్నా అంటే ఇష్టపడుతున్నానని అంది. ప్రస్తుతం త్రిష...తన గురువు ప్రియదర్శన్ దర్శకత్వంలో కట్టా మీటా చిత్రం చేస్తోంది. అలాగే తమన్నా నటించిన సుర చిత్రం తమిళనాట ఈ వారమే రిలీజైంది. విజయ్ ఆ చిత్రంలో హీరోగా చేసారు.


Click it and Unblock the Notifications











