రజనీకాంత్ ని కావాలనే ఏడ్పించా...ఐశ్వర్య రాయ్
రజనీకాంత్, ఐశ్వర్య రాయ్ జంటగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన 'రోబో'లో రజనీకాంత్ స్టయిల్ గా సిగరెట్ ఎగురవేసి పట్టుకునే సీన్ ఉంది. ఈ సీన్ షూటింగ్ లో రజనీ, ఐష్ పాల్గొన్నారు. రజనీ రెగ్యులర్ గా తన స్టైయిల్ లో సిగరెట్ ఎగరేసి పట్టుకున్నా..ఐష్ మాత్రం సరిగ్గా యాక్ట్ చేయకుండా టేక్స్ మీద టేక్స్ తింది. దాంతో రజనీకాంత్ సహనం నసించింది. చివరికి చాలా సేపటికి గానీ సీన్ ఓకే కాలేదు. అయితే ఇదంతా ఐశ్వర్య రాయ్ కావాలనే చేశానని తర్వాత చెప్పింది. ఎందుకంటే ఆమెకు రజనీకాంత్ సిగరెట్ ని స్టయిల్ గా పట్టుకోవడం చాలా ఇష్టం. అందుకని కావాలనే సరిగ్గా యాక్ట్ చేయకపోవటంతో. మళ్లీ మళ్లీ రజనీ సిగెరెట్ ఎగిరేసి పట్టుకున్నారు. ఆ స్టయిల్‌ని దగ్గరనుంచి చూసి ఆనందించాచనంటోంది. తర్వాత ఈ విషయం తెలుసుకున్న రజనీకాంత్ బాగానే ఎంజాయ్ చేసారు. ఇక ఈ విషయం నిజమేనని దర్శకుడు శంకర్ కన్ఫర్మ్ చేస్తూ...ఈ సంఘటన జరిగినప్పుడే మేం ఐశ్వర్య...రజనీసార్ కి ఎంత ప్యానో తెలిసివచ్చింది అన్నారు.


Click it and Unblock the Notifications











