శుభాకాంక్షలు తెలిపిన రజనీకాంత్

By Srikanya

చెన్నై : పద్మశ్రీ కమల్‌హాసన్‌ 59వ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన మిత్రుడు, ప్రముఖ నటుడు రజనీకాంత్‌ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. రజనీకాంత్‌తో పాటు తమిళ సినీ పరిశ్రమకు చెందిన పలువురు ఆయనకు ఫోన్‌ ద్వారా శుభాకాంక్షలు అందజేశారు. తన పుట్టినరోజును పురస్కరించుకుని బుధవారం అర్థరాత్రినగరంలోని ఓ ప్రైవేటు హోటల్‌ సినీరంగంలోని ప్రముఖులైన వారికి కమల్‌హాసన్‌ విందు ఇచ్చాడు. నటులు ఆర్య, ధనుష్‌, దర్శకులు మణిరత్నం, సెల్వమణి, నటి సుహాసిని తదితరులు కమల్‌కు పుష్పగుచ్ఛంతో శుభాకాంక్షలు తెలపగా, వారి సమక్షంలో ఆయన కేక్‌ కట్‌ చేశారు.

కమల్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ విడుదల చేసిన ప్రకటనలో యాక్షన్‌కింగ్‌ అర్జున్‌ మాట్లాడుతూ.. సినిమాకు సంబంధించిన అన్నీ కళలను తెలిసిన వ్యక్తి కమల్‌హాసన్‌ అని, ఆయన తమలాంటి వారికి ఓ ప్రేరణగా వర్ణించాడు. మరో 50ఏళ్లకు పైగా ఆయన ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు.

తన పుట్టినరోజును పురస్కరించుకుని ఆళ్వార్‌పేటలోని తన నివాసం వద్ద జరిగిన కార్యక్రమంలో కమల్‌హాసన్‌ ప్రత్యేక ప్రతిభావంతులకు ట్రైసైకిళ్లు, పేద మహిళలకు కట్టుమిషన్‌లు, పేద విద్యార్థులకు ఆర్థిక సాయంగా నగదు చెక్కులు అందజేశారు. కమల్‌హాసన్‌ అభిమాన సంఘం నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X