రజనీతో చేయాలనుకున్నా... ఆ విషయం తెలిసి నిరాశ చెందా: డైరెక్టర్ శంకర్

By Bojja Kumar

రజనీకాంత్ హీరోగా '2.0' లాంటి భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న దర్శకుడు శంకర్.... దీని తర్వాత సూపర్ స్టార్‌తో ఓ బయోపిక్ ప్లాన్ చేసుకున్నారట. అయితే ఈ లోపే ఆ బయోపిక్ మరొకరు మొదలు పెట్టడంతో నిరాశకు గురయ్యానని, అయితే ఈ చిత్రాన్ని ఎస్‌.ఏ చంద్రశేఖర్‌ తీస్తున్నారని తెలిసి సంతోషించానని శంకర్ తెలిపారు. చెన్నైలో సోమవారం సాయంత్రం జరిగిన 'ట్రాఫిక్‌ రామస్వామి' ఆడియో వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరైన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ట్రాఫిక్ రామస్వామి ఎవరు?

ట్రాఫిక్ రామస్వామి ఎవరు?

తమిళనాడుకు చెందిన సామాజికవేత్త కెఆర్ రామస్వామి. రాష్ట్రంలో ట్రాఫిక్‌కు సంబంధించిన సమస్యల పరిష్కారానికి రామస్వామి ఎంతో కృషి చేశారు. దీంతో ఆయన్ను అందరూ ‘ట్రాఫిక్ రామస్వామి' అని పిలుస్తుంటారు.

రామస్వామి జీవితం ఆధారంగా బయోపిక్

రామస్వామి జీవితం ఆధారంగా బయోపిక్

ప్రముఖ తమిళ దర్శకుడు, హీరో విజయ్‌ తండ్రి ఎస్‌.ఏ చంద్రశేఖర్‌ ప్రధాన పాత్రలో ‘ట్రాఫిక్‌ రామస్వామి' బయోపిక్ రూపొందుతోంది. ఈ చిత్రానికి విక్కీ దర్శకత్వం వహిస్తున్నారు. సోమవారం చెన్నైలో జరిగిన ఆడియో వేడుకకు శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

నేను తీయాలనుకున్నాను, కానీ...

నేను తీయాలనుకున్నాను, కానీ...

ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ..‘ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించే వారికి వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి రామస్వామి. అప్పట్లో ఆయన చేస్తున్న పనులు చూసి ఆశ్చర్యపోయేవాడిని, పేపర్లో ఆయన గురించి చదివి మనసులోనే అభినందిచేవాడిని. ఆయన కత్తి పట్టని భారతీయుడు. రజనీకాంత్ ప్రధాన పాత్రలో రామస్వామి బయోపిక్ తీయాలనుకున్నాను, అయితే ఈ సినిమా మరొకరు చేస్తున్నారని తెలిసి నిరాశ చెందాను. కానీ ఇందులో నటిస్తున్నది ఎస్.ఏ.చంద్రశేఖర్ అని తెలిసి సంతోషంగా ఫీలయ్యాను అని శంకర్ తెలిపారు.

చంద్రశేఖర్ చక్కగా ఒదిగిపోతారు

చంద్రశేఖర్ చక్కగా ఒదిగిపోతారు

‘ట్రాఫిక్ రామస్వామి బయోపిక్‌‌లో ఎస్‌.ఏ చంద్రశేఖర్‌ చక్కగా ఒదిగిపోతారు. ఈ సినిమా చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను, చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్' చెబుతూ శంకర్ తన ప్రసంగం ముగించారు. ఈ చిత్రంలో అంబిక, ఆర్కే సురేష్, మనోబాలా, చేతన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X