షాలినీపై కస్సుమన్న అజిత్... కారణం వెల్లడించిన హీరో కో-స్టార్

కోలీవుడ్ మెగాస్టార్ అజిత్ హీరోగానే కాదు, మంచి మనసున్న మారాజుగానూ పేరుగడించాడు. ఇండస్ట్రీలో ఎవరికి కష్టం వచ్చినా ముందుండే తల, మృదు స్వభావి అన్న విషయమూ విదితమే. ఇక భర్తగానూ మంచిమార్కులే వేయించుకున్న అజిత్, నిజానికి షాలినీపై ఓ సారి కస్సుమన్నాడట. ఆ విషయాన్ని అతని కో-స్టార్ పృధ్వీరాజ్ వెల్లడించం మరో విశేషం.

కొంతకాలం క్రితం సూర్య, అజిత్ ల తీరుపై అభ్యంతరం వ్యక్తం చేసిన పృధ్వీరాజ్, ఇప్పుడు పంథా మార్చుకున్నారు. ఇండస్ట్రీలో అజిత్ మాత్రమే జెంటిల్మెన్ అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాదు.. అతడి మంచి మనసు వివరించేందుకు ఓ సంఘటనను కూడా గుర్తుచేసున్నాడు.

When Thala was upset with his darling wife, Reveals Ajiths co-star

లాక్ డౌన్ కు ముందు ఓ రెస్టారెంట్ కు వెళ్లగా, అక్కడ అజిత్ భార్య షాలినీ, కుమార్తెతో పాటూ కనిపించారని తెలిపిన పృథ్వి, ఎప్పుడూ ఆమెతో మాట్లాడనందున మిన్నకుండిపోయాడట. అయితే షాలినీ సైతం అతడిని చూసినప్పటికీ, పలుకరించాలా వద్దా అన్న సంశయంలో ఉండిపోయిందట. కానీ, ఆమె ఇంటికి వెళ్లి విషయాన్ని అజిత్ కు వివరించగా, షాలినీకే చివాట్లు పడ్డాయట. పృథ్వి తన కో-స్టార్ అని, స్కూల్ లోనూ తన సీనియర్ అని, కాస్త చొరవ తీసుకుని అతడిని పలుకరించాల్సింది అని అజిత్ షాలినీపై మండిపడ్డాడట.

అజిత్ మాటలకు నొచ్చుకున్నప్పటికీ, షాలినీ తాను చేసిన పొరపాటు గ్రహించి, పృథ్వి నంబర్ తీసుకుని మరీ అతడికి కాల్ చేసి క్షమాపణలు తెలిపిందట. ఈ విషయాన్ని పృథ్వీ స్వయంగా మీడియాకు వెల్లడించడం విశేషం. ఏమైనా ఈ సంఘటనతో తలా అజిత్ హుందాతనం మరో వెల్లడైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X