వేర్ ఎవర్ హి గోస్..షి ఫాలోస్ అంటూ హచ్ యాడ్ ని ప్యారడి చేసి తమాషా చేస్తున్నారు 'Aayiraththil Oruvan' యూనిట్ సభ్యులు. ఆ తమిళ చిత్రంలో హీరో ధనుష్ ఎక్కడుంటే అతని భార్య ఐశ్వర్య (రజనీ కూతురు)అక్కడుంటోంది. అందుకోసం ఆమె ఆ చిత్ర దర్శకుడు బావగారు అయిన సెల్వ రాఘవన్ దగ్గర అసెస్టెంట్ గా చేరింది. దర్శకత్వ విభాగంలో తన భార్య ఎందుకు చేరిందో ధనుష్ కి మొదటి అర్ధం కాలేదు. ఏదోలే ఆసక్తి ఉండి ఉంటుందని సరిపెట్టుకున్నాడు. కానీ అసలు నిజం తర్వాత బయిటపడింది. ఆమెకు ధనుష్ ప్రవర్తన మీద అనుమానం వచ్చిందిట. దాంతో వేరే వాళ్ళను ఎంక్వైరీ చేయటం మనస్సాంతి పోగొట్టుకోవటం కన్నా తానే రంగంలోకి దూకటం మేలని ఆ పని చేసిందని తేలిందిట. అయితే ఈ విషయాన్ని ఆమె దగ్గర ఎత్తలేని స్ధితి ధనుష్ ది. ఎందుకంటే ఆమెకు తన మామగారు(కస్తూరి రాజా), అత్తగారు, బావగారు వద్ద బాగా ర్యాప్ ఉంది. దాంతో కొన్నాళ్ళయినా తన రాసలీలలు కట్టిపెట్టాలనే నిర్ణయానికి వచ్చాడని యూనిట్ సభ్యులు అంటున్నారు.