Vijayakanth: విజయ్‌కాంత్ సినిమాలను తెలుగులో రీమేక్ చేసి హిట్ కొట్టిన హీరోలు ఎవరంటే?
తమిళ హీరో, డీఎండీకే అధినేత విజయ్ కాంత్ డిసెంబర్ 28న అనగా ఈరోజు కన్నుమూశారు. ఆయన అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరగా.. చికిత్స పొందుతూ నేడు తుదిశ్వాస విడిచారు. ఇదిలా ఉంటే.. ఆయన ఇప్పటి వరకు 150కి పైగా సినిమాల్లో నటించారు అయితే ఆయన సినిమాలను తెలుగులో రీమేక్ చేసి హిట్ కొట్టిన వారున్నారు. తమిళంలో హిట్ అయిన సినిమాలను తెలుగులో రీమేక్ చేసి.. హిట్ కొట్టిన హీరోలు ఎవరు.. ఆ సినిమాలు ఏంటి అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
తమిళ కథానాయకుడు, డీఎండీకే అధినేత విజయకాంత్ 150కు పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. అయితే ఆయన తమిళంలో తప్ప మరో భాషలో సినిమాలు చేయలేదు. ఆయన సినిమాలు కొన్నిటిని తెలుగులో డబ్బింగ్ చేయగా.. తెలుగులో కూడా బాగానే హిట్ అయ్యాయి. అలా తెలుగు వారికి విజయ్ కాంత్ సుపరిచితమే. అయితే ఆయన సినిమాలను మన హీరోలు రీమేక్ చేసి.. హిట్ కొట్టిన సందర్భాలు ఉన్నాయి.
Recommended Video


మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఠాగూర్ సినిమా రీమేక్ అనే విషయం చాలా మందికి తెలియదు. ఠాగూర్ సినిమాను తెలుగులో వీ వీ వినాయక్ దర్శకత్వం వహించాడు. అయితే ఈ సినిమాను మొదట ఏఆర్ మురగదాస్.. రమణ అనే పేరుతో విజయ్ కాంత్ హీరోగా తెరకెక్కించారు. ఇక ఈ సినిమా అక్కడ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. దీంతో ఆ సినిమాను మన మెగాస్టార్ చిరంజీవి ఠాగూర్ సినిమాలో నటించి హిట్ కొట్టాడు.
చిరంజీవి రమణ అనే సినిమానే కాదు.. అంతకు ముందు.. సత్తం ఓరు ఇరుత్తరై అనే సినిమాను తెలుగులో చట్టానికి కళ్లు లేవు అనే టైటిల్ తో రీమేక్ చేశారు. ఇక ఈ సినిమా తమిళంలో విజయ్ కాంత్ కు.. తెలుగులో చిరంజీవికి మంచి హిట్ ఇచ్చింది. ఇదే కాదు.. చిరంజీవి దేవాంతకుడు సినిమా విజయకాంత్ తమిళ సినిమా 'వెట్రికి రీమేక్. ఖైదీ నంబర్ 786 కూడా కెప్టెన్ 'అమ్మన్ కోయిల్ కళిక్కలే' రీమేక్ గా తెరకెక్కింది.

ఇక వెంకటేష్ నటించిన చిన్నరాయుడు ఎంత హిట్ అయిందో తెలిసిందే. అయితే ఈ సినిమా తమిళ హిట్, విజయకాంత్ సినిమా 'చిన్న గుండర్' ఆధారంగా తెరకెక్కింది. ఇవే కాకుండా.. మోహన్ బాబు నటించిన నేనే రాజు నేనే మంత్రి.. తమిళంలో 'నన్నే రాజా నన్నే మంత్రి'కి రీమేక్. ఇదే కాకుండా 'నా మొగుడు నాకే సొంతం' కూడా కెప్టెన్ 'ఎన్ పురుషన్ థాన్ ఎనక్కు మట్టుమ్ థాన్' రీమేక్ గా తెరకెక్కింది.

విజయకాంత్ నటించిన 'వెనతై పోలా'ను రాజశేఖర్ 'మా అన్నయ్య' పేరుతో రీమేక్ చేసి హిట్ కొట్టాడు. శోభన్ బాబు, భానుచందర్ లాంటి వారు కూడా విజయ్ సినిమాలను రీమేక్ చేసి హిట్ కొట్టారు. ఇలా చాలా మంది తెలుగు హీరోలు విజయ్ కాంత్ సినిమాలను రీమేక్ చేసి.. తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్స్ ను అందుకున్నారు.


Click it and Unblock the Notifications











