Vanitha Vijayakumar : వనితా విజయ్ కుమార్ నాలుగో పెళ్లి.. వరుడు ఎవరో తెలుసా?
కోలీవుడ్ దిగ్గజ నటుడు విజయ్ కుమార్ , దివంగత మంజుల వారసురాలిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన వనితా విజయ్ కుమార్ తన సినిమాల కంటే వ్యక్తిగత విషయాలతోనే ఎప్పుడూ వివాదాల్లో వార్తల్లో ఉంటారు. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న ఆమె.. తాజాగా నాలుగో పెళ్లికి రెడీ అయ్యారు. ఇప్పటికే ముహూర్తం , వేదిక ఖరారైంది. దీంతో వనిత పెళ్లి చేసుకోబోయే వ్యక్తి , అతని నేపథ్యం, వీరిద్దరికి ఎలా పరిచయమైందనే విషయాలపై ప్రజల్లో ఎన్నో సందేహాలు నెలకొన్నాయి. ఈ వివరాల్లోకి వెళితే :
సినిమా బ్యాక్‌గ్రౌండ్ కావడంతో వనితా విజయ్ కుమార్ చాలా సులభంగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. చంద్రలేఖ సినిమా ద్వారా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె .. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన దేవి సినిమాతో తెలుగువారిని పలకరించారు. ఈ చిత్రం ఘన విజయం కావడంతో ఆమెకు తెలుగు, తమిళ్‌లో అవకాశాలు పోటెత్తాయి. కెరీర్‌లో నిలదొక్కుకుంటున్న టైంలో అనూహ్యంగా పెళ్లి చేసుకుని షాకిచ్చారు వనితా. పెళ్లి కారణంగా సినిమాలకు కూడా గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది.

వనితా విజయ్ కుమార్ వైవాహిక జీవితం నుంచి తొలి నుంచి ఒడిదొడుకులు ఎదుర్కొంటూ వివాదాస్పదంగా మారింది. తొలుత నటుడు ఆకాష్‌ను ఆమె వివాహం చేసుకోగా.. వీరికి విజయ్ శ్రీ హరి, జోవిక అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆకాష్‌తో విడిపోయాక వ్యాపారవేత్త ఆనంద్ జే రాజన్‌ను పెళ్లాడారు వనిత. వీరికి జయనిత అనే కుమార్తె జన్మించింది. కానీ ఈ పెళ్లి కూడా ఎక్కువ రోజులు సాగలేదు. రాజన్‌తో విడాకులు తీసుకున్నాక చాలా ఏళ్లు ఒంటరిగానే బండి నడిపించారు వనిత. ఈ క్రమంలో 2020లో కోవిడ్ సమయంలో పీటర్ అనే వ్యక్తిని పెళ్లాడింది. అయితే ఇద్దరి మధ్యా మనస్పర్ధలు, పీటర్ మొదటి భార్యకు విడాకులు ఇవ్వకపోవడంతో అతని నుంచి కూడా వనితా విజయ్ కుమార్ విడిపోయారు. మద్యానికి బానిస అయిన పీటర్.. గతేడాది గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే.
వనితా విజయ్ కుమార్ ఖచ్చితంగా మరో పెళ్లి చేసుకుంటారని అంతా భావించారు. చివరికి ఈ మాటలే నిజమై, ఆమె మరో తోడును వెతుక్కుని నాలుగోసారి మూడు ముళ్లు వేయించుకోవడానికి సిద్ధమయ్యారు. అక్టోబర్ 5న రాబర్ట్ రాజ్ అనే వ్యక్తిని తాను పెళ్లాడబోతున్నట్లు వనిత తెలిపారు. ఓ బీచ్‌లో మోకాళ్ల మీద కూర్చొని రాజ్‌కు ప్రపోజ్ చేస్తూ విజయ్ కుమార్ కనిపించారు. వృత్తిరీత్యా కొరియోగ్రాఫర్ అయిన రాబర్ట్‌తో ఆమె గత కొన్నేళ్లుగా సహజీవనం చేస్తోంది.

బిగ్‌బాస్ తమిళ్ 6వ సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన రాబర్ట్.. బాగా పాపులర్ అయ్యాడు. గతంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గానూ, డ్యాన్సర్‌గానూ రాబర్ట్ పనిచేశాడు. రాబర్ట్ అక్క అల్ఫోన్సా నటిగా, ఐటెం సాంగ్స్ స్పెషలిస్ట్‌గా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే తన మూడో భర్త పీటర్‌తో పెళ్లికి ముందే వనిత - రాబర్ట్‌లు డేటింగ్‌లో ఉన్నట్లు కోలీవుడ్ మీడియా చెబుతోంది. అయితే వనిత నిజంగానే నాలుగో పెళ్లి చేసుకోబోతోందా లేక అది ప్రమోషనల్ స్టంటా అనేవారు కూడా లేకపోలేదు. మరి నిజంగానే వనిత నాలుగోసారి పెళ్లి పీటలెక్కబోతున్నారా లేదా తెలియాలంటే అక్టోబర్ 5 వరకు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











