అత్తారింటికి దారేది రీమేక్.. వాళ్ళిద్దరిలో హీరో ఎవరు!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ మూవీ అత్తారింటికి దారేది తమిళంలో రీమేక్ కాబోతున్న సంగతి తెలిసిందే. బడా నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. ఇంకా హీరో ఎవరు, దర్శకుడు వంటి విషయాల్లో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.
ఇటీవల ఈ సంస్థ తమిళ రీమేక్ హక్కులని సొంతం చేసుకుంది. తమిళ మీడియాలో జరుగుతున్న ప్రచారం, అభిమానుల్లో జరుగుతున్న చర్చ ప్రకారం అజిత్ లేదా విజయ్ హీరోగా నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అత్తారింటికి దారేది విడుదలై హిట్ అయిన సందర్భంలోనే హీరో విజయ్ ఈ చిత్ర రీమేక్ పట్ల ఆసక్తి చూపించాడు.

కానీ ఆ సమయంలో వరుస చిత్రాలతో బిజీగా ఉండడం వలన ఆ నిర్ణయం వెనక్కు వెళ్ళింది. ఇక అజిత్ కూడా అత్తారింటికి దారేది చిత్రంలో హీరోగా సరిపోతాడని ఉహాగానాలు వినిపిస్తున్నాయి.
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పవన్ కళ్యాణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. వినోదాత్మక అంశాలతో పాటు,ఫ్యామిలీసన్నివేశాలు హైలైట్ కావడంతో ఈ సినిమా ఘనవిజయం సాధించింది.


Click it and Unblock the Notifications











