బిగ్‌‌బాస్‌లోకి వివాదాస్పద నటి కూతురు.. ఎవరీ జోవిక? ఆమెకు ఎందుకంత క్రేజ్!

ఇండియాలోని అన్ని ప్రధాన భాషల్లో అత్యంత ప్రేక్షకాదరణ ఉన్న రియాలిటీ షో బిగ్‌బాస్ క్రేజీగా మొదలయ్యాయి. తెలుగులో ఇప్పటికే ఈ షో నాలుగు వారాలు పూర్తి చేసుకోగా, తమిళంలో 7వ బిగ్‌బాస్ సీజన్ అక్టోబర్ 1వ తేదీన ప్రారంభమైంది. లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ హొస్ట్‌గా గ్రాండ్‌గా లాంచ్ చేశారు. బిగ్‌బాస్ తమిళ్ (Bigg Boss Tamil 7) షోలో కంటెస్టెంట్లు ఎవరు? ఎంత మంది హౌస్‌లోకి వచ్చారు. ఇంకా ఈ షో గ్రాండ్ ఓపెనింగ్ వివరాల్లోకి వెళితే..

బిగ్‌బాస్ తమిళ్ (Bigg Boss Tamil 7) 7 సీజన్ షోలో ప్రత్యేక వాతావరణం కనిపించింది. సీనియర్లు, జూనియర్ల మేళవింపుతో ఇంటిని ఆకర్షణీయంగా మార్చారు. అయితే గత సీజన్లకు భిన్నంగా తాజా సీజన్‌లో రెండు హౌజ్‌లు ఏర్పాటు చేసి ఇంటి సభ్యులకే కాకుండా ప్రేక్షకుల్లో ఆసక్తిని నింపారు. ఈ రెండు హౌజ్‌లను ఏర్పాటు చేయడం వెనుక ట్వీస్ట్ ఏమిటో సీక్రెట్‌గా ఉంచారు.

Who is Jovika Vijay Kumar? What makes Bigg Boss Tamil 7 special with her entry?

ఇక బిగ్‌బాస్ తమిళ్ (Bigg Boss Tamil 7) ఇంటిలోకి వచ్చిన కంటెస్టెంట్లలో జోవిక విజయ్ కుమార్ ప్రత్యేక ఆకర్షణగా మారారు. సినీ నటి, యూట్యూబర్, బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ వనితా విజయ్ కుమార్ కూతురు జోవిక. జోవిక సోషల్ మీడియాలో టాప్ ఇన్‌ఫ్లూయెన్సర్. తన తల్లి నడిపే వంటల యూట్యూబ్ ఛానెల్‌ను నిర్వహిస్తుంటారు. వంటల తయారీ వీడియోలను ప్రొడ్యూస్ చేస్తుంటారు. తల్లి అడుగు జాడల్లో నడుస్తూ బిగ్‌బాస్‌ తమిళ్‌లోకి అడుగుపెట్టారు.

Who is Jovika Vijay Kumar? What makes Bigg Boss Tamil 7 special with her entry?

బిగ్‌బాస్ తమిళ్ (Bigg Boss Tamil 7) షోలోకి అడుగుపెట్టిన జోవిక విజయ్ కుమార్ ఎమోషనల్ అయ్యారు. తాను ఇంటిలోకి వచ్చినప్పటికీ.. తన వెంట తన తల్లి కూడా ఉన్నారనే ఫీలింగ్‌తో అడుగుపెట్టాను. మానసికంగా నా తల్లి నాకు ఇంటిలో తోడుగా ఉంటుంది. నా తల్లి స్పూర్తితో గేమ్‌ను ఆడి ప్రేక్షకులను ఆకట్టుకొంటాను అని జోవిక విజయ్ కుమార్ అన్నారు.

Who is Jovika Vijay Kumar? What makes Bigg Boss Tamil 7 special with her entry?

జోవిక విజయ్ కుమార్ కెరీర్ విషయానికి వస్తే.. చెన్నైలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. మోడల్‌గా కెరీర్ ఆరంభించిన తర్వాత సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. యూట్యూబర్‌గా కుకింగ్ షోలతో మరింత పాపులారిటీ సంపాదించుకొన్నారు. సినీ రంగంలోకి అడుగుపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Who is Jovika Vijay Kumar? What makes Bigg Boss Tamil 7 special with her entry?

ఇదిలా ఉండగా, బిగ్‌బాస్ తమిళ్ (Bigg Boss Tamil 7) షో 100 రోజులపాటు కొనసాగనున్నది. ఈ షోను టెలివిజన్‌లో విజయ్ టీవీ, ఓటీటీలో డిస్నీ+హాట్ స్టార్ లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వనున్నది. ప్రతీ రోజు షోలో హైలెట్స్‌ను రాత్రి 9.30 గంటల నుంచి గంటపాటు విజయ్ టీవీ ప్రసారం చేయనున్నది. శనివారం, ఆదివారం 9 గంటల నుంచి విజయ్ టీవీ ప్రసారం చేస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X