Who is Sangeeta Sornalingam: సంగీత సోర్నలింగం ఎవరు? దళపతి విజయ్ భార్య ఆస్తులు ఎన్ని వందల కోట్లంటే?
తమిళ సూపర్ స్టార్, టీవీకే పార్టీ అధినేత విజయ్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తూ విడాకుల కోసం భార్య సంగీత సోర్నలింగం కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం సినీ, రాజకీయ వర్గాల్లో సంచలనం రేపింది. గత కొద్దికాలంగా విజయ్, సంగీత మధ్య దాంపత్యపరమైన సమస్యలు కొనసాగుతున్నాయి. అందుకు కారణం ఓ స్టార్ హీరోయిన్‌తో ఇళయ దళపతికి ఉన్న వివాహేతర సంబంధమే అనే వార్త మీడియాలో చక్కర్లు కొడుతున్నది. అయితే ఆ వార్తకు బలం చేకూరే విధంగా సంగీత చెన్నైకి సమీపంలోని చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో ఈ వివాదం పబ్లిక్ అయింది. అయితే సంగీత ఎవరు? ఆమె ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? ఆమె వ్యక్తిగత ఆస్తుల విలువ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..
సంగీత వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. లండన్‌లో ప్రముఖ పారిశ్రామిక వేత్త సొర్నలింగమ్ కూతురు సంగీత. ఈ కుటుంబం శ్రీలంకలోని తమిళుల తెగకు చెందిన వారు. వ్యాపారాల రీత్యా లండన్‌లో స్థిరపడ్డారు. విజయ్ హీరోగా స్టార్ డమ్ సంపాదిస్తున్న సమయంలో ఆయనకు ఆకర్షితురాలై ఓ అభిమానిగా అతడి జీవితంలోకి ప్రవేశించింది. అభిమానిగా ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా, ఆ తర్వాత పెళ్లికి దారి తీసింది. 1999 సంవత్సరంలో వారిద్దరూ వివాహం చేసుకొన్నారు. దాదాపు 25 సంవత్సరాలకుపైగా దాంపత్య జీవితాన్ని కొనసాగించారు.

అయితే వ్యక్తిగత విభేదాల కారణంగా విడాకుల పిటిషన్ దాఖలు చేస్తూ.. తన భర్త విజయ్‌కు ఓ నటితో వివాహేతర సంబంధం ఉంది. ఆ కారణంగా నేను మానసిక క్షోభను అనుభవిస్తున్నాను. విజయ్‌తో దాంపత్య జీవితాన్ని కొనసాగించడం కష్టంగా ఉంది. వివాహేతర సంబంధం, సంసారపరంగా వేర్వేరుగా ఉంటున్నాం. ఆయన నుంచి మెంటల్ క్రూయాలిటీ భరించలేను. కాబట్టి ఆయనతో విడాకులు ఇప్పించండి అంటూ సంగీత డైవోర్స్ పిటిషన్ దాఖలు చేయడం భారీ చర్చకు తెరలేపింది.
అయితే 2021 సంవత్సరం నుంచి విజయ్, సంగీత మధ్య కలతలు, కలహాలు కొనసాగుతున్నాయి. దాంతో ఆమె లండన్‌లోని పుట్టింటికి వెళ్లింది. విజయ్‌తో సపరేట్ అయింది. లండన్‌లోని తన కుటుంబ వ్యవహారాలను, బిజినెస్ కార్యక్రమాల్లో బిజీగా మారిపోయింది. ఈ క్రమంలో దళపతిపై తీవ్ర ఆరోపణలు చేస్తూ విడాకులు కోరుతూ తన జీవితాన్ని సక్రమంగా కొనసాగించడానికి భారీగా భరణాన్ని ఇప్పించాలని కోర్టును వేడుకొన్నది.
గత కొద్దికాలంగా లండన్‌లో ఉంటున్న సంగీత భర్తతో అంటిముట్టనట్టే ఉంటున్నారు. కూతురు, కొడుకుతో తన రిలేషన్స్‌ను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం కుటుంబ బిజినెస్ వ్యవహారాలతో తలమునకలై ఉన్నారు. విడాకుల పిటిషన్ దాఖలు చేసే సమయానికి ఆమె వ్యక్తిగతంగా, తండ్రి నుంచి సంక్రమించిన ఆస్తుల విలువ 400 కోట్ల రూపాయలకుపైనే ఉంటుంది అని ఆర్థిక సంస్థలు లెక్కకట్టాయి.
దాదాపు నాలుగేళ్లుగా దాంపత్యపరమైన వివాదం కొనసాగుతున్నప్పటికీ.. రాజకీయ పార్టీతో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ పడుతున్న టీవీకే పార్టీ అధినేత విజయ్‌పై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ విడాకులు కోరడం అనేక అనుమానాలు, సందేహాలకు తెర లేపింది. ఆమె ఆరోపణలు, డైవోర్స్ పిటిషన్ దాఖలు చేయడం వెనుక ఏ రాజకీయ పార్టీ వ్యక్తిగత ప్రయోజనాలు ఉన్నాయా? అనే చర్చ తమిళనాడులో జరుగుతున్నది.


Click it and Unblock the Notifications











