నయనతార బ్యాన్ ఎత్తడం వెనక

By Staff

Nayantara
నయనతార మీద ఈ మధ్య బ్యాన్ పెట్టడం,రెండు రోజులు కూడా తిరగకుండానే తొలిగించటం జరిగిందే. అయితే అంత పట్టుదలగా ఉన్న నయనతార హఠాత్తుగా ఎందుకు లొంగిందన్నది ఎవరికీ అర్ధం కాలేదు. అలాగే డబ్బు కట్టనని భీష్మించుకు కూర్చున్న ఆమె ఎలా ఆ కమిట్ మెంట్ కు ఒప్పుకుందని ఆమె మొండితనం తెల్సిన వాళ్ళు షాక్ అయ్యారు. అయితే మరో షాకయ్యే విషయం ఏమిటంటే ఆ సెటిల్ మెంట్ జరిగినట్లు నయనతారకూ మొదట తెలియకపోవటం. ఆమె బదులుగా ఉదయనిధి స్టాలిన్ అనే నిర్మాత ఈ డబ్బు పే చేసారు.

ఎందుకలా అంటే ఆయన ప్రస్తుతం నయనతార, సూర్య కాంబినేషన్ లో Aadhavan సినిమా ప్లాన్ చేసారు. ఈ బ్యాన్ తో ఆ సినిమా ఆగిపోతుందని వెంటనే రంగంలోకి దూకి లింగుస్వామితో మాట్లాడి, ఆ డబ్బు పే చేసారు. ఆయన నయనతారని ఈ విషయమై రెండు సార్లు మాట్లాడి సెటిల్ చేసుకోమని చెప్పాడు. అయితే ఆమె సానుకూలంగా స్పందించకపోవటంతో కొంత షూటింగ్ జరిగిన తన సినిమా ఆగిపోవటం ఇష్టం లేక ఆ పనిచేసాడని తెలుస్తోంది. అలాగే ఆ మొత్తాన్ని నయనతార రెమ్యునేషన్ నుండి కూడా కట్ చేయటం లేదుట. అంటే తప్పు చేసింది నయనతార...ఫైన్ కట్టింది పాపం ఆ నిర్మాత అన్నమాట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X