‘అమ్మ’ కోసం దర్శకుల మధ్య పోట్లాట మొదలైంది... ఎవరికి దక్కేనో?
Recommended Video

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ఒకప్పటి ప్రముఖ నటి, తమిళనాట అందరూ 'అమ్మ' అంటూ ఆరాధించే జయలలిత మరణం తర్వాత అక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ పొలిటికల్ గొడవల గురించి పక్కన పెడితే జయ జీవితాన్ని తెరకెక్కించాలని చాలా రోజులుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మన దగ్గర ఎన్టీఆర్ బయోపిక్ మాదిరిగానే అక్కడ జయలలిత బయోపిక్ రాబోతోంది అనుకునే లోపే ఈ సినిమా విషయంలో వివాదాలు ముసురుకున్నాయి. అందుకు కారణం ఒకరికంటే ఎక్కువ మంది ఈ బయోపిక్ తీస్తున్నామంటూ ప్రకటనలు చేయడమే.

పోటాపోటీ ప్రకటనలు
నిర్మాత విష్ణు ఇందూరి జయలలిత బయోపక్ తీస్తున్నట్లు, తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నట్లు ఇటీవల ప్రకటించారు. 2019లో సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుందని తెలిపారు.

ప్రియదర్శిని మరో ప్రకటన
ఏఎల్ విజయ్ దర్శకత్వంలో సినిమా ప్రకటించారో లేదో.... ప్రియదర్శిని అనే మరో దర్శకుడు కూడా నేను ‘అమ్మ' బయోపిక్ తీస్తానంటూ ప్రకటన చేశాడు. అమ్మ జీవితంపై చాలా రీసెర్చ్ చేశామని, సినిమా మొదలు పెట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు.

భారతి రాజా కూడా తెరపైకి
ఆల్రెడీ ఇద్దరు ‘అమ్మ' బయోపిక్ మేము తీస్తామంటే మేము తీస్తామని పోట్లాడుకుంటుంటే.... సీనియర్ తమిళ దర్శకుడు భారతీ రాజా కూడా రంగంలోకి దూకారు. తాను జయలలిత బయోపిక్ తీయబోతున్నట్లు, సీనియర్ దర్శకుడిగా తనకు తెలిసినన్ని విషయాలు ఎవరికీ తెలియవు... భరద్వాజ్ నిర్మాతగా ఈ సినిమా పనులు మొదలయ్యాయి. ఇళయరాజాతో మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా జరుగుతున్నాయంటూ ప్రకటన చేశారు.

ఏం జరుగబోతోంది?
మరి జయలలిత బయోపిక్ ఈ ముగ్గురిలో ఎవరు తీస్తారు? ముగ్గురూ మూడు సినిమాలు తమకు నచ్చిన విధంగా తీస్తారా? అనే సందేహాలు తమిళ ప్రజల్లో నెలకొన్నాయి. జయలలిత రాజకీయ జీవితం, సినీ జీవితం, వ్యక్తిగత జీవితంలో చాలా వివాదాలు ఉన్నాయి. ఇవన్నీ బయోపిక్‌లో చూపిస్తారా? ఎవరు ఏ అంశాలను తమ చిత్రాల్లో ఫోకస్ చస్తారు? అనేది తమిళనాట చర్చనీయాంశం అయింది.


Click it and Unblock the Notifications











