ఐశ్వర్య రాయ్‌తో రొమాన్స్.. కట్ చేస్తే పెట్రోల్ బంక్‌లో వర్కర్‌గా యువ హీరో!
సినీ పరిశ్రమలో ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడం కష్టమే అని చెప్పాలి. ఈ రోజు స్టార్ హీరోగా, హీరోయిన్‌గా ఉన్న వాళ్లు.. పాతాళలోకానికి పడిపోవడం లాంటి సంఘటనలు ఎన్నోసార్లు చూశాం. అయితే ఒకప్పుడు అమ్మాయిల రాకుమారుడిగా మారిన ఓ స్టార్ యువ హీరో పరిస్థితి ఊహించుకొంటేనే చాలా దారుణంగా అనిపిస్తుంది. ఆ హీరో ఎవరు? ఆయన పరిస్థితి అలా ఎందుకు మారిందనే వివరాల్లోకి వెళితే..
ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ప్రేమ దేశం సినిమా ఎంతటి విజయాన్ని అందుకొన్నదో కొత్తగా చెప్పనక్కర్లేదు. అలాంటి సినిమా ద్వారా పరిచయమైన అబ్బాస్‌కు యువత బ్రహ్మరథం పట్టారు. ఆ సినిమా రిలీజ్ తర్వాత ఓవర్‌నైట్‌లోనే స్టార్ హీరోగా మారారు. ఆ తర్వాత ఆయనను వెతుక్కొంటూ భారీగా నిర్మాతలు, దర్శకులు వచ్చారు. అయితే తనకు వచ్చిన అవకాశాలన్నీ చేసుకొంటూ ఆయన వెళ్లారు.

ప్రేమదేశం సినిమా అబ్బాస్‌ను ఇమేజ్‌ను ఆకాశానికి ఎత్తివేసింది. ఆ తర్వాత వచ్చిన వీఐపీ, ప్రియా ఓ ప్రియా, శాంతి శాంతి శాంతి, రాజహంస లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దాంతో చాలా మంది నిర్మాతలు ఆయనకు ముఖం చాటేశారు. దాంతో పడయప్పా (నరసింహ) లాంటి సినిమాల్లో గెస్ట్ హీరోగా కనిపించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ సినిమా రంగంలో 50 సినిమాలకు పైగా నటించారు. అయితే ఏ సినిమా కూడా ప్రేమదేశం అందించిన విజయాన్ని ఇవ్వలేకపోయాయి. దాంతో స్టార్ రేసులో అబ్బాస్ వెనుక పడ్డారు. సినిమా రంగంలో అవకాశాలు సన్నగిల్లాయి. దాంతో కొన్నాళ్లు మోడలింగ్ చేసుకొంటూ అదృష్టం కోసం వెతుక్కొన్నాడు. కానీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు.
దక్షిణాదిలో సినిమా ఆఫర్లు తగ్గడంతో బాలీవుడ్ నుంచి వచ్చిన అవకాశాలపై దృష్టిపెట్టారు. అంశ్ అనే సినిమా కూడా పెద్దగా నడవలేదు. దాంతో కొన్ని సినిమాలు ప్రారంభం కావాల్సిన ఆగిపోయాయి. కొన్ని మధ్యలోనే షూటింగులు క్యాన్సిల్ అయ్యాయి. బాత్రూం క్లీనర్ లాంటి ప్రొడక్టులకు మోడల్‌గా పనిచేశారు. అంతేకాకుండా టెలివిజన్ రంగంలో కూడా ప్రయత్నించారు. అక్కడ కూడా నిరాశే మిగిలింది.
ఇక సినిమా పరంగా తనకు లాభం లేదని భావించిన అబ్బాస్ న్యూజిలాండ్‌లో స్థిరపడ్డారు. తన జీవితాన్ని చక్కదిద్దుకొనేందుకు దొరికిన చిన్న చిన్న ఉద్యోగాలు చేయాల్సి వచ్చింది. తన వద్ద ఉన్న సేవింగ్స్ కూడా అయిపోవడంతో చేసేది ఏమీ లేక.. కన్‌స్ట్రక్షన్ కంపెనీలో మెకానిక్‌గా, పెట్రోల్ బంకులో క్యాషియర్‌గా పనిచేశారు. ఒకప్పుడు స్టార్ హీరోలకు పోటీగా మారిన యువ హీరో కెరీర్ ఇలా దారుణంగా మారడం అభిమానులను దిగ్బ్రాంతికి గురి చేసింది.


Click it and Unblock the Notifications











