అమల తప్పుకుందా... తప్పించారా? ఇంకా ఆగని "సుచీలీక్స్" ప్రకంపనలు
సడన్‌గా వడ చెన్నై నుంచి అమల వాకౌట్ చేసింది అన్న వార్త అందరినీ షాక్ కి గురి చేసింది. అమల సడన్‌గా ఉన్నట్టుండీ ఈ ప్రాజెక్ట్‌నుంచి ఎందుకు తప్పుకుందనేది తెలీదు.
సుచీలీక్స్ ఈ పేరు కోలీవుడ్ నే కాదు మొత్తం దక్షిణాది సినీపరిశ్రమనే ఒక ఊపు ఊపేసింది. ఒక్కొక్క పోస్టూ లో ఊక్కొక్కరీ పేరూ, వారి చీకటి రహస్యం బయటికి వస్తూంటే వచ్చిన వాళ్ళు అవమానం తోనూ, రానివాళ్ళు తమ పేరెక్కడ వస్తుందో అన్న భయం తోనూ వణికి పోయారు.

సింగర్ సుచిత్ర
ఇప్పుడు ఆ పోస్టులు ఆగిపోయినా సింగర్ సుచిత్ర పుట్టించిన ప్రకంపణలు మాత్రం ఇంకా అలానే ఉన్నాయి. ఇప్పుడు పాపం ఈ ప్రభావం అమలా పాల్ మీదా పడింది. ధనుష్ తో రాబోతున్న "వడ చెన్నై" నుంచి అమల తప్పుకుంది. ఇంతకీ అమలా పాల్ తప్పుకుందా తీసేసారా అన్న విషయం ఇప్పుడు కోలీవుడ్ హాట్ టాపిక్....

పక్కా కారణం ఏమిటీ
అసలు అమలా పాల్ విజయ్ ల మధ్య జరిగిన విడాకుల వ్యవహారానికి పక్కా కారణం ఏమిటీ అన్నది ఎవ్వరికీ తెలియకపోయినా ధనుష్ తో అమల కు ఉన్న సాన్నిత్య సంబందమే వీళ్ళ మధ్య ఎడబాటుకు కారణమైందన్న పుకారు అప్పట్లో బలంగా వినిపించింది. అయితే పెద్ద వాళ్ళ వ్యవహారం కావటం తో ఈ సంగతి ఓపెన్ సీక్రెట్ గానే ఉందిపోయింది.

ఒక అభిప్రాయానికి వచ్చేసారు
ఈ గొడవ జరుగుతూండగానే ధనుష్ "వడ చెన్నై" లో హీరోయిన్ గా అమలా పాల్ ని తీసుకున్నారూ అని తెలియగానే అంతా ఒక అభిప్రాయానికి వచ్చేసారు... ఆ తర్వాత సుచీ లీక్స్ తో ఈ అనుమానం మరింత బలపడింది. విఐపి(రఘువరన్ బీటెక్ ) తర్వాత 'వడ చెన్నయ్' చిత్రంలోను అమలా పాల్‌ని ధనుష్ కథానాయికగా తీసుకోవడంతో ఈ పుకార్లు ఊపందుకున్నాయి.

అమల వాకౌట్ చేసింది
అయితే సడన్‌గా ఈ చిత్రం నుంచి అమల వాకౌట్ చేసింది అన్న వార్త అందరినీ షాక్ కి గురి చేసింది. అమల సడన్‌గా ఉన్నట్టుండీ ఈ ప్రాజెక్ట్‌నుంచి ఎందుకు తప్పుకుందనేది తెలీదు. డేట్లు కుదరకనే అని కవర్ చేస్తున్నారు గానీ అసలు ఆఫర్లే లేని అమలా పాల్ కి డేట్ల సమస్య అనటమే వింతగా ఉంటే...

మరో హీరోయిన్ కోసం వేట
అసలు ముందే సైన్ చేసాక ఇప్పుడు డేట్స్ లేవనటం మరింత విడ్డూరంగానే కనిపిస్తోంది.. ఇప్పుడు అమల స్థానం లో మరో హీరోయిన్ కోసం వేట మొదలు పెట్టింది ఈ సినిమా టీమ్. అమలా స్థానం లో ఐశ్వర్యా రాజేష్ ని తీసుకున్నట్టు వార్తలు వస్తున్నా ఇంకా అధికారికంగా దృవీకరించలేదు .

గుసగుసలు
అయితే ధనుష్, అమలా పాల్ పేర్లతో జరుగుతోన్న రచ్చ దృష్టిలో వుంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నారని, అమల కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకునే విషయం లో సానుకూలంగా స్పందించిందని గుసగుసలు మాత్రం అక్కడక్కడా వినిపిస్తున్నాయి. ఇదంతా లోపాయికారీ వ్యవహారమే తప్ప అధికారిక సమాచారం మాత్రం కాదు.

అనిరుధ్‌తో కూడా
సుచీ లీక్స్ వ్యవహారం తర్వాత ధనుష్ కార్యకలాపాలపై రజనీకాంత్ ప్రత్యేకదృష్టి పెట్టారని, అతని ప్రాణ స్నేహితుడు అనిరుధ్‌తో కూడా ధనుష్ దూరంగా వుంటున్నాడని గాసిప్స్ వున్నాయి. అసలే కష్టాల్లో ఉన్న అమల కి ఇప్పుడు చేతిలో ఉన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కూడా చేజారి పోయింది..


Click it and Unblock the Notifications