ఆర్డినరీ హీరోతో చేయనని కరాఖండి గా చెప్పిన స్టార్ హీరోయిన్...!?
తెలుగు, తమిళంలో హీరోయిన్ గా తెగ బిజీ అయిపోయిన అనుష్క ఈమధ్య తమిళంలో తనకొచ్చిన క్రేజ్ తో రెమ్యూనరేషన్ అమాంతగా పెంచేస్తోందట. అసలే మణిరత్నం సినిమాలో హీరోయిన్ గా బుక్ అయింది. ఆ మాత్రం హెడ్ వెయిట్ పెరగకుండా వుంటుందా. ఈ మధ్య లారెన్స్ తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా ప్లాన్ చేశాడు. అందులో హీరోయిన్ గా అనుష్కను అడిగితే తన రెమ్యునరేషన్ అమాంతం పెంచేసి ఆ మౌంట్ కి అయితేనే చెస్తానని చెప్పింది.
అక్కడితో ఆగకుండా తమిళంలో లారెన్స్ తో చేయనని, తను చెప్పిన హీరోతో సినిమా చేస్తేనే తమిళంలో నటిస్తానని డిమాండ్ చేసిందట. బహుశా తమిళంలో లారెన్స్ ఆర్డినరీ హీరో అని, అతను అక్కడ అందరికీ బాగా తెలుసని అందుకే తమిళంలో లారెన్ప్ రిజెక్ట్ చేసిందని సమాచారం.తెలుగులో అయితే లారెన్స్ పక్కన చెయ్యడానికి ఎలాంటి అభ్యంతరం లేదని ఇప్పటివరకు మంచి హీరోయిన్ అని పేరు తెచ్చుకొన్నఅనుష్క ఒక్కసారిగా ఇలా మారిపోవడంతో ఆ నిర్మాతలు కూడా షాక్ అయ్యారట. ఇంతకీ తమిళంలో అనుష్కను పడేసిన ఆ హీరో ఎవరో...?


Click it and Unblock the Notifications











