ఆర్నాల్డ్‌ పంక్షన్ మధ్యలో ఎందుకు వెళ్లిపోయారు?

By Srikanya

చెన్నై: శంకర్‌ దర్శకత్వం వహించిన 'ఐ' ఆడియో వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఆర్నాల్డ్‌ అక్కడా ఓ సంచలనం సృష్టించి అందర్నీ ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. వేదికపై క్లుప్తంగా మాట్లాడిన ఆయన.. ఆడియో సీడీని విడుదల చేయకుండానే వెళ్లిపోయారు. వేదికపై కొంతసేపు వేచి ఉండాలని కార్యక్రమం నిర్వహిస్తున్న యాంకర్ కోరినా వినిపించుకోలేదు. దానికి కారణం ఏమిటా అని తమిళ పరిశ్రమ అంతటా ఆశ్చర్యపోయింది. ఒక్కొక్కరూ ఒక్కోరకంగా దీనిపై మాట్లాడుకున్నారు. అసలు నిజం ఏమిటి అంటే...

విశ్వసనీయ సమాచారం మేరకు... ఆర్నాల్డ్‌ను నిర్వాహకులు బాడీ బిల్డర్లతో ఒక ఫీట్‌ ఏర్పాటు చేయించి, వారి ద్వారా ఆయన్ను సగర్వంగా వేదికమీదకు తీసుకొచ్చారు. ఆ సందర్భంగా బాడీబిల్డర్లు ఆయనతో ఫొటో తీసుకోవడానికి పోటీ పడ్డారు. దాంతో వారి శరీరాలకు పూసిన నూనె ఆర్నాల్డ్‌ దుస్తులకు అంటుకుని ఇబ్బంది పడ్డారు. అందుకే ఆయన మధ్యలో వెళ్లిపోయినట్లు తెలిసింది

Why Arnold Schwarzenegger left from AI Audio?

హాలీవుడ్‌ కండల వీరుడు, ఏడుసార్లు మిస్టర్‌ యూనివర్స్‌ విజేతైన ఆర్నాల్డ్‌ ష్క్వార్జ్‌నెగ్గర్చెన్నైలో చేసిన సందడి అంతా ఇంతాకాదు. సోమవారం తెల్లవారుజామున మూడున్నర గంటలకే చెన్నైపురిలో వాలిపోయిన ఆర్నాల్డ్‌... ఐదున్నర గంటలకు అల్పాహారం తీసుకున్నారు. అక్కడ సిబ్బందిని 'ఇడ్లీ, పొంగల్‌' అడిగి మరీ వడ్డించుకుని రుచి చూశారు.

తనకు దక్షిణ భారతదేశం, తమిళనాడు వంటకాలపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. అంతేనా ముఖ్యమంత్రి జయలలితతో భేటీకి పంచెకట్టులో వెళ్లాలని తెగ ఉబలాటపడ్డారట. దానికోసం ఒక పంచె కూడా తెమ్మని 'ఐ' సినిమా నిర్మాత ఆస్కార్‌ రవిచంద్రన్‌ను కోరారట. సమయాభావం వల్ల పంచెలో వెళ్లడం కుదరలేదని రవిచంద్రన్‌ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X