మెగాస్టార్ చిరంజీవి ఎందుకు భాగ్యరాజానే కావలన్నాడు...!
ప్రముఖ తమిళ నటుడు, రచయిత, దర్శకుడు భాగ్యరాజాకు మంచి గుర్తింపు ఉంది. పంచ్ డైలాగులు రాయడంలో భాగ్య రాజా దిట్ట. ఆ విషయం చిరంజీవికి తెలుసు. అందుకే తన కొడుకు రామ్ చరణ్ నటించిన 'మగధీర" తమిళ వెర్షన్ 'మావీరన్"కు డైలాగులు రాసిపెట్టమని నోటెడ్ యాక్టర్, డైరెక్టర్ భాగ్యరాజాని చిరంజీవి కోరాడట.
తమిళంలో చిరు తనయుడు మొదటగా పరిచయం అవుతోన్న సినిమా కాబట్టి తమిళ ఆడియన్స్ కు చేరువుగా భాగ్యరాజా డైలాగులు సమకూర్చగలడని చిరంజీవి భాగ్యరాజాని ఎన్నుకోవడం జరిగింది. సాధారణంగా డబ్బింగ్ సినిమాలంటే ఆల్రెడి ఉపయోగించిన డైలాగ్స్ తో ఎటువంటి మార్పులేకుంటే ఆడియెన్స్ అర్థం కాదనే దృక్ఫతంతో ఫ్రెష్ గా డైలాగు రాయించటానికే భాగ్యరాజ్ సహాయం కోరినట్టు సమాచారం.
మామూలుగా భాగ్యరాజా డబ్బింగ్ సినిమాలకు డైలాగులు రాయడు. కానీ చిరంజీవి హెల్ప్ చేయమని కోరడంతో, ఈ చిత్రానికి మాటలు రాయడానికి భాగ్యరాజా సమ్మతించాడట. ఇటీవలే 'మావీరన్" ఆడియో విడుదలైంది. త్వరలో సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











