త్రిష చిత్రం ఆడియో రిలీజ్ లండన్ లో కారణం?
త్రిష, శింబు జంటగా గౌతం మీనన్ దర్శకత్వంలో రెడీ అయిన 'విన్నైత్తాండి వరువాయా' చిత్రం ఆడియో పంక్షన్ లండన్ లో ఏర్పాటు చేసారు. దీనికి ప్రత్యేకమైన కారణం ఉందా అని మీడియా గౌతం మీనన్ ని అడిగింది. దానికాయన సమాధానంగా మేము చిత్రాలను అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందిస్తున్నాం. కానీ మార్కెట్ మాత్రం తమిళనాడు దాటటంలేదు. మేం ఆ ఇబ్బందిని అధిగమించదలుచుకున్నాం. మా చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్ చేసి మార్కెట్ పెంచదలచుకున్నాం. ఆ వ్యూహంలో భాగమే..లండన్ లో ఆడియో రిలీజ్. అలాగే ఈ చిత్రానికి సంగీతం అందిస్తోంది ఆస్కార్ విజేత ఎ.ఆర్.రహమాన్. ఆయన్ని కూడా లండన్ తీసుకెళ్ళటం ద్వారా మరోసారి ప్రపంచానికి ఆస్కార్ విజేత మా ఇండియాకు సంభందించిన వ్యక్తి అని చెప్పాలనే అన్నారు.


Click it and Unblock the Notifications











