హోలీ అంటే రజనీకాంత్‌కి స్పెషల్ డే ఎందుకంటే?
చెన్నై : హోలీ పండగ అంటే ఎంత కలర్ ఫుల్ గా ఉంటుందో కొత్తగా చెప్పక్కర్లేదు. అయితే రజనీకాంత్ అభిమానులకు మాత్రం హోలీ రోజంటే మరింత స్పెషల్. అందుకు ప్రత్యేక కారణం కూడా ఉంది. శివాజీ రావు గౌక్వాడ్‌గా ఉన్న సూపర్ స్టార్ 'రజనీకాంత్'గా తన పేరును మార్చుకుంది ఈ రోజే.
అవును, రజనీకాంత్ అసలు పేరు శివాజీ రావ్ గైక్వాడ్. కర్నాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తి. బస్ కండక్టర్ ఉద్యోగం వదిలేసి తమిళ సినిమాల్లో నటించడం మొదలు పెట్టిన శివాజీ రావు గైక్వాడ్‌కి దర్శకుడు బాలచందర్ 1975లో ఆయనకు రజనీకాంత్‌గా నామరకరణం చేసారు.
చంద్రకాంత్, శ్రీకాంత్, రజనీకాంత్ అనే మూడు పేర్లను ప్రతిపాదించగా....తన గురువు అయిన బాలచందర్ కే నిర్ణయం వదిలేసారు. ఈ మూడు పేర్ల నుంచి రజనీకాంత్ అనే పేరును సెలక్ట్ చేసారు బాలచందర్. ఆ పేరు ఆయనకు ఎంత కలిసొచ్చొందో ప్రస్తుతం రజనీకాంత్ పొజిషన్ చూసి అర్థం చేసుకోవచ్చు.

అందుకే హోళీ రోజు రజనీకాంత్ జీవితంలో ఓ ప్రత్యేకమైన రోజు

అయితే రెండు సందర్భాల్లో మాత్రం హోళీ రోజున రజనీకాంత్ తన గురువు బాలచందర్ ను కలవడం మిస్సయ్యారు. రజనీకాంత్ బిజీ షెడ్యూల్ వల్లనే ఆ రెండు సందర్భాల్లో అతన్ని కలవడం మీట్ కాలేదు. అభిమానులు మాత్రం ప్రతి హోళీని ఎంతో స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకుంటారు.

త్వరలో రజనీకాంత్ ఇండస్ట్రీలో అడుగు పెట్టి 4 దశాబ్దాలు పూర్తి చేసుకోబోతున్నాడు.

రజనీకాంత్ ప్రస్తుతం ‘కొచ్చాడయాన్' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా ఆయన కూతురు సౌందర్య దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. హిస్టారికల్ ఫిక్షన్ నేపథ్యంలోరూపొందుతున్న ఈచిత్రం ప్యాండ్య రాజు కొచ్చాడయాన్ రణధీరన్ కథ ఆధారంగా రూపొందుతోంది.

కొచ్చాడయాన్ చిత్రంలో దీపిక పడుకొనె హీరోయిన్ గా నటిస్తోంది. జాకీ ష్రాఫ్, శరత్ కుమార్, శోభన, ఆది తదితరులు నటిస్తున్నారు. ఈచిత్రం జులై నెలలో విడుదలయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











