అందుకే రజనీ ప్రక్కన నొ చెప్పా: ఇలియానా
గోవా సుందరి ఇలియానాకి ఆ మధ్యన తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 'సుల్తాన్ - ది వారియర్' చిత్రంలో నటించమని ఆఫర్ వచ్చింది. వేరెకరు అయితే ఎగిరి గంతేసి ఒప్పుకునే వారు. కానీ ఇలియానా మాత్రం ఖాళీ లేవని చెప్పి తిరస్కరించింది.అయితే అసలు కారణం రీసెంట్ గా ఓ ఇంటర్వూలో వివరించింది. తమిళ, హిందీ చిత్ర పరిశ్రమల నుంచి కూడా నాకు అనేక ఆఫర్లు వస్తున్నాయి. అయితే పాత్రలో సత్తా లేకపోతే ఒప్పుకోవడానికి ఏమాత్రం సిద్ధంగా లేను. అందుకే 'సుల్తాన్ - ది వారియర్' వద్దనుకున్నా అంది. అలాగే గతంలో ఇలియానా 'కేడీ' అనే తమిళ చిత్రంలో నటించింది. తమిళంలో ఇలియానాకు అదే తొలి చిత్రం. ఆ చిత్రం బాక్సాఫీసు వద్ద ఘోరంగా ఫ్లాప్ అయింది. తొలి చిత్రమే చేదు అనుభవం మిగల్చడంతో కలతచెందిన ఇలియానా ఇక మంచి పాత్ర దొరికితే తప్ప కాలీవుడ్‌లో నటించకూడదని ఆమె నిశ్చయించుకుంది. ఇక 'కిక్', 'రెచ్చిపో' చిత్రాల అనంతరం ఆమె తన పారితోషికం కూడా పెంచేసింది. ప్రస్తుతం ఆమె విష్ణు ప్రక్కన సలీం చిత్రంలో చేస్తోంది.


Click it and Unblock the Notifications











