Ponniyin Selvan వేషం ఇవ్వమని బతిమిలాడిన రజనీకాంత్.. రిజెక్ట్ చేసిన మణిరత్నం.. ఏం జరిగిందంటే?

దేశం గర్వించదగిన దర్శకుడు మణిరత్నం డైరెక్షన్‌లో రూపొందుతున్న పొన్నియన్ సెల్వన్ చిత్రం సెప్టెంబర్ 30వ తేదీన రిలీజ్‌కు సిద్దమవుతున్నది. విక్రమ్, జయం రవి, కార్తీ, జయరాం, ఐశ్వర్యరాయ్, త్రిష తదితరులు నటించారు. ఈ చిత్రం ఆడియో రిలీజ్ ఫంక్షన్ భారీగా, అంగ రంగ వైభవంగా నిర్వహించారు. చెన్నైలోని స్పోర్ట్స్ స్టేడియంలో జరిగిన వేడుకకు రజనీకాంత్, కమల్ హాసన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అయితే వినోదాత్మకంగా రజనీకాంత్ తన స్పీచ్‌తో ప్రేక్షకులను, సినీ తారలను, అభిమానులను నవ్వుల్లో ముంచెత్తారు. రజనీకాంత్ స్పీచ్ వివరాల్లోకి వెళితే..

పొన్నియన్ సెల్వన్ చిత్రం ఆడియో రిలీజ్

పొన్నియన్ సెల్వన్ చిత్రం ఆడియో రిలీజ్


చెన్నైలో జరిగిన పొన్నియన్ సెల్వన్ చిత్రం ఆడియో రిలీజ్ ఫంక్షన్ అద్బుతంగా సాగింది. భారీ సెట్టింగ్స్, భారీగా తరలి వచ్చిన సినీ తారలతో స్టేడియం కళకళలాడింది. ఐశ్వర్యరాయ్ ప్రత్యేక ఆకర్షణగా మారారు. త్రిష, విక్రమ్, జయం రవి ఈ వేడుకకు జోష్ తీసుకొచ్చారు. ఏఆర్ రెహ్మన్ మ్యూజిక్‌కు సంబంధించిన పాటలు అభిమానులతో కేక పెట్టించాయి.

పొన్నియన్ సెల్వన్ సినిమా తీస్తున్నారని

పొన్నియన్ సెల్వన్ సినిమా తీస్తున్నారని

ఇలాంటి అంశాల మధ్య రజనీకాంత్ ప్రసంగం మరింత వినోదంగా మార్చేసింది. కమల్ హాసన్‌తో కలిసి రజనీకాంత్ మాట్లాడుతూ.. పొన్నియన్ సెల్వన్ సినిమా తీస్తున్నారని తెలిసి.. అందులో భాగం కావాలని కోరుకొన్నాను. మణిరత్నంకు ఫోన్ చేసి.. నాకు పెరియా పజువెత్తరైయార్ పాత్ర ఇస్తే నేను చేస్తానని చెప్పాను. ఆ పాత్ర ఇవ్వకున్నా.. నాకు ఇందులో స్పెషల్ అప్పీయరెన్స్‌తో చిన్న పాత్ర ఇవ్వమని వేడుకొన్నాను అని రజనీకాంత్ చెప్పారు.

నీకు చిన్న వేషం ఇస్తే..

నీకు చిన్న వేషం ఇస్తే..

అయితే గెస్టు పాత్ర ఇవ్వమని కోరినా మణిరత్నం కనికరించలేదు. నేను అడిగితే వేషం ఇవ్వనని చెప్పాడు. నీకు చిన్న వేషం ఇస్తే.. నీ ఫ్యాన్స్ నా బొమ్మలు తగలపెడుతారు. సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తారు. ఆ పాపం నేను మూటగట్టుకోలేనని చెప్పాడు. నీలాంటి వాడికి చిన్న వేషం ఇచ్చి నేను మిమ్మల్ని తక్కువగా అంచనా వేయలేనని మణిరత్నం చెప్పాడు అని రజనీకాంత్ అన్నాడు.

అవకాశం దొరికిందని మణిరత్నం అలా

అవకాశం దొరికిందని మణిరత్నం అలా

అయితే ఎవరైనా నేను నటిస్తానని చెబితే.. నన్ను పూర్తిగా వాడుకొంటారు. కానీ అవకాశం దొరికిందని మణిరత్నం అలా చేయలేదు. ఎవరితో ఏ పాత్ర చేయించాలనే విషయం ఆయనకు తెలుసు. అందుకే ఆయన మణిరత్నం అయ్యారని రజనీకాంత్ ప్రశంసలు గుప్పించారు. రజనీకాంత్ చెప్పిన మాటలతో స్టేడియం, వేడుక మారిమోగిపోయింది. సినీ తారలందరూ రజనీ స్పీచ్ వింటూ నవ్వుల్లో మునిగిపోయారు.

ఇండియన్ సినిమా చరిత్రలో

ఇండియన్ సినిమా చరిత్రలో

పొన్నియన్ సెల్వన్ ఈవెంట్‌లో ముగ్గురు హీరోలు ఉన్నారు. ఒకరు ఈ సినిమాకు ఆధారంగా నిలిచిన కల్కి పుస్తకం. నిర్మాత సుభాస్కరన్, మణిరత్నం ముగ్గురు హీరోలు. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్ ఎప్పుడు మొదలవుతుందా.. టికెట్లు కొందామని వెయిటింగ్. ఈ సినిమా మంచి ఆదరణ ఉంది. తప్పకుండా ఈ సినిమా విజయం సాధిస్తుందని రజనీకాంత్ ఆకాక్షించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X