సెక్సీ నమిత..స్టోరీ డిష్కషన్స్
ఈ మధ్యన స్టోరీ డిస్కషన్ అంటే నమిత ఉలిక్కిపడుతోందని సమాచారం. సాధారణంగా స్టోరీ లైన్ ఓకే అయ్యాక ఓ స్టార్ హోటల్ లో ఓ డీలక్స్ రూమ్ బుక్ చేసి ఆ సబ్జెక్టుపై కొంత మంది రైటర్స్ ని కూర్చోపెట్టుకుని దర్శకుడు ఓ స్టోరీని ఫామ్ చేసుకుంటాడు. వీటిని స్టోరీ డిస్కషన్స్ అంటూంటారు. అయితే ఈ డిష్కషన్స్ సమయంలో హీరోలు కూడా పాల్గొని తమ పాత్రలు మరింత బాగా తీర్చుదిద్దుకోవటానికి ట్రై చేస్తూంటారు. అయితే ఈ మద్య కొంతమంది తమిళ నిర్మాతలు హీరోయిన్స్ కూడా ఈ డిష్కషన్స్ లో కూర్చుంటే పూర్తిగా కథ బుర్రలో కెక్కి తెరపై మరింత మెచ్యూర్ గా వస్తుందని ఫిటింగ్ పెట్టడం ప్రారంభించారు. అయితే ఆ నిర్మాతలు ఆలోచన వేరే ఉంటుందని ఈ డిష్కషన్స్ కి అటెండయిన వాళ్ళు గొణుక్కుంటున్నారు. డిష్కషన్ సమయంలో ఎంటర్టైన్ చేయటానికి వీరిని ఆశ్రయిస్తున్నారు నిర్మాతలు.
అయితే తమ వైపు తప్పు లేకుండా ఎగస్ట్రా పేమెంట్ ఇవ్వటానికి రెడీ అవుతున్నారు. కాస్త ఖాలీగా ఉన్న హీరోయిన్స్, కొత్త వాళ్ళు వీటిపై ఆసక్తి చూపి ఆ రూపాయి కూడా సంపాదించుకుందామని చూస్తున్నారు. అయితే నమితకు మాత్రం ఇవి నచ్చటం లేదు. రెండు మూడు నెలలు ఓ సినిమా కోసం ఎగస్ట్రాగా డేట్స్ ఇవ్వటానికి తానంత ఖాళీగా లేనని తెగేసి చెప్తోంది. అదే ఏ జ్యూయిలరీ షాప్ కో పోయి ఓపినింగ్ చేస్తే మినిమం పది లక్షలు పడతాయి. అదే రోజంతా ఉన్నా లక్ష పడటం గగనం అంటోంది ఈమె. ఇప్పటికే మొహమాటం చేతో, ఆసక్తితోనో, డబ్బు గురించో కొన్ని స్టోరీ డిష్కషన్స్ లో పాల్గొన్న వాటిని ఇప్పుడు విమర్శిస్తోంది. ఇంతా కష్టపడి డిష్కషన్స్ లో పాల్గొంటే ఏ ఐటం సాంగో, గెస్ట్ రోలో, సెకెండ్ హీరోయిన్ ఇచ్చేవారని ఆమె వాపోయింది. అందుకే మిగతా హీరోయిన్స్ కూడా స్టోరి డిష్కషన్స్ అనవసరం అనే సలహా ఇస్తోంది.


Click it and Unblock the Notifications











