నా అరుంధతి అదే..నమిత
భారీ అందాల నమిత ఎక్కడకి కెళ్ళినా అరుందతి సినిమా టాపిక్ తెస్తోంది. అదేంటి ఆమె పోటీ హీరోయిన్ అనూష్క చేసిన చిత్రం గురించి ఈమెకెందుకు అంటే అదో కొత్త మార్కెటింగ్ టెక్నిక్ అంటున్నారు. ఇంతకీ ఆమె చేసేదేమిటంటే మొదట అరుంధతి అంత హిట్టయింది..ఇంత ఆడింది అంటూ చెప్పి..తర్వాత తను చేసిన జగన్మోహిని టాపికి విషయం తెస్తోంది. అది కూడా సోషియా ఫాంటసీ, హీరోయిన్ ఓరియెంటెడ్ సిన్మా గాబట్టి అరుంధతిలా ఆడుతుందని చెప్తోంది. అరుంధతిలో లేని ఎంటర్టైన్ మెంట్ తమ సినిమాలో ఉందని చెప్తోంది. అందులోనూ తను ఆ సినిమాలో చాలా గ్లామర్ గా కనిపిస్తుందని చెప్తోంది. అరుంధతి లో హిట్టుకు దారితీసిన ఎలిమెంట్స్ అన్నీ తమ చిత్రంలో తెలియకుండానే చోటు చేసుకున్నాయని చెప్తోంది. అలాగే జగన్మోహిని ఆల్రెడీ హిట్టయిన సినిమా రీమేక్ కాబట్టి మినిమం గ్యారెంటీ ఉంటుందని చెప్తోంది. ఇక ఆ చిత్రంలో నమిత సెక్సప్పీల్ అదిరిందని టాక్. ఇక నమిత, అనూష్క ఇద్దరూ బికినీలు వేసుకుని భిల్లా చిత్రంలో నటించారు.


Click it and Unblock the Notifications











