ప్రభుదేవాని ఎవాయిడ్ చేస్తున్న నయనతార

By Srikanya

నయనతార,ప్రభుదేవా త్వరలో పెళ్లి చేసుకుంటారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.అయితే తాజాగా జరగిన ఓ సంఘటన వారిద్దరి మధ్యన ఎడబాటు కలిగించిందని, నయనతార ..ప్రభుదేవాని ఎవాయిడ్ చేస్తోందంటూ ఓ ఇంగ్లీష్ డైలీ వార్తను ప్రచురించింది. వివరాల్లోకి వెళితే... కొన్ని రోజులుగా నయనతార కొచ్చిన్‌లో ఉంటున్నారు. అయితే ఇటీవల ప్రభుదేవా తన పిల్లలను తీసుకుని విదేశాలకు వెళ్లారట. కానీ ఈ విషయాన్ని నయనతార దగ్గర ఆయన దాచారట. షూటింగ్ నిమిత్తం విదేశాల్లో ఉన్నట్లు ఆమెకు చెప్పారట ప్రభుదేవా. కానీ అసలు విషయం ఆ తర్వాత తెలుసుకున్న నయనతార వెంటనే ప్రభుదేవాకి ఫోన్ చేసి, విదేశాల్లో షూటింగ్ జరుగుతున్న ఆ సినిమా లొకేషన్‌కు వస్తానన్నారట. అది ఊహించని ప్రభుదేవా కంగారుపడిపోయి నయనతారను ముంబయిలో ఉండమని చెప్పి, హుటాహుటిన తన పిల్లలను చెన్నయ్‌లో వదిలి ముంబయిలో వాలిపోయారట. ఈ సంఘటనకు చిర్రెత్తిన నయనతార కోపంతో కొచ్చిన్ వెళ్లిపోయారట. ఇది తెలుసుకుని ప్రభుదేవా అక్కడికి వెళ్లారట. వేగంగా కొచ్చిన్ అయితే వెళ్లగలిగారు కానీ నయనతార ఇంట్లో అడుగుపెట్టడానికి ఆయనకు రెండు గంటలపైనే పట్టిందట. ఆ తర్వాత ఆమె ప్రభుదేవా ఫోన్ చేసినా లేదుట. అంతేగాక ఇక సినిమాలు చేయనన్న ఆమె మలయాళ రంగానికి చెందిన ఓ ప్రముఖ పత్రికవారికి ఫోన్ చేసి, ఫొటోషూట్ చేస్తానని చెప్పారని చెప్తున్నారు.అంతేగాక బాడీగార్డ్ సీక్వెల్ లో నటించటానికి కూడా ఆమె సైన్ చేయాలని నిర్ణయించుకున్నారని వార్త. అంటే మళ్ళీ సినిమాల్లోకి ఆమె వస్తుందా అని ఆమె అభిమానులు ఎదురుచూస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X