రజనీకాంత్ లాగే పవన్ కూడా:హరీష్ శంకర్

By Srikanya

పవన్ కళ్యాణ్ తాజా చిత్రం గబ్బర్ సింగ్..తమిళ భాక్సాఫీస్ వద్ద కూడా తన స్టామినాను చూపుతూ కలెక్షన్స్ వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో మీడియా వారు దర్శకుడు హరీష్ శంకర్ ఈ విషయమై ప్రశ్నించారు. దానికి హరీష్ సమాధానమిస్తూ...ప్రపంచవ్యాప్తంగా ఉన్నవారు రజనీకాంత్ ని భాషాభేధం లేకుండా చూడటానికి ఎలా ఆసక్తి చూపుతారో అలాగే పవన్ ని చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్,కమెడీ,ఆయన ఛరిష్మా,సినిమాలో విజువల్స్...అన్ని చోట్ల ఉన్న ప్రేక్షకులను ఈ సినిమాకు కనెక్ట్ చేస్తోంది అన్నారు.

ఇక తమిళంలో ఆల్రెడీ శింబుతో ధరణి దర్శకత్వంలో దబాంగ్ చిత్రం రీమేక్ అయ్యింది. కాబట్టి అక్కడి వారికి ఈ కథేమీ కొత్త కాదు. అయినా ఈ సినిమాని చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. దీనిపై హరీష్ చెప్తూ...నేను పవన్ కళ్యాణ్ కి పెద్ద ప్యాన్ ని అందులోనూ ఆయన నుంచి పూర్తి మసాలా సినిమాలు వచ్చి చాలా కాలం అయ్యింది. నేను బేసిక్ గా రైటర్ ని కావటంతో స్క్రిప్టులో మార్పులు చేసుకున్నారు. లోకల్ ప్లేవర్ ని కలిపాను. నేను పూర్తిగ పవన్ కళ్యాణ్ మ్యానరిజంస్,ఆయన బాడీ లాంగ్వేజ్ మీద ఫోకస్ చేసాను. అందుకే అవి వర్కవుట్ అయ్యాయి అన్నారు.

తమిళంలో అంత విజయం సాధించటానికి మరో కారణం శృతి హాసన్ అని చెప్తున్నారు. కమల్ హాసన్ కూతురు పూర్తి స్ధాయి మసాలా పాత్రలో విలేజ్ అమ్మాయిగా కనిపించటం జరిగింది. ఇన్నాళ్లూ ఆమెను అర్బన్ బేసెడ్ కథలో చూసిన వారు ఈ గబ్బర్ సింగ్ లో కొత్తగ చూస్తున్నారు. ముఖ్యంగా పాటల్లో ఆమె అభినయం వారిని కట్టిపారేస్తుందని చెప్తున్నారు. శృతి హాసన్ తమ తమిళ హీరో కూతురు కావటం కూడా అక్కడ ప్లస్ అయిన అంశం. శృతి కూడా ఈ సినిమా సూపర్ హిట్ అవటం,తొలిసారి విజయం రుచి చూడటంతో చాలా ఆనందంగా ఉంది.


'' 'గబ్బర్ సింగ్' నా కెరీర్‌లోనే ఓ మైలురాయిగా నిలిచిపోతుంది. ఇప్పటివరకూ నేను చేసినవన్నీ ఆధునిక పాత్రలే. కానీ, తొలిసారి ఇందులో అచ్చ తెనుగు అమ్మాయిగా కనిపించాను. ఈ పాత్రను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను'' అని శ్రుతిహాసన్ చెప్పారు. కో-స్టార్ పవన్‌కళ్యాణ్ గురించి చెబుతూ -''ఆయనతో కలిసి పనిచేయడం ఓ అద్భుతమైన అనుభవం. తన దగ్గర చాలా కొత్త విషయాలు నేర్చుకున్నా. తను మంచి నటుడే కాదు... మంచి హ్యూమన్ బీయింగ్ కూడా'' అని ప్రశంసించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X