సమంత తెలివైంది..అందుకే రిజక్టు చేసింది

By Srikanya

చెన్నై :'రీమేక్‌ సినిమాల్లో అసలైన ఫీల్‌ కనిపించదన్నది నా అభిప్రాయం. ఎంత నటించినా.. ఇతరుల అనుకరణ కనిపిస్తుంది. అసలైన నటనకే అధికంగా ప్రాధాన్యమిస్తా. సినిమా విడుదలయ్యాక కూడా ఒరిజినల్‌ సినిమాలోని హీరోయిన్ తో పోల్చి చూస్తారు. నన్ను ఎవరితో పోల్చినా ఒప్పుకోను. నచ్చదు కూడా. అందువల్లే రీమేక్‌ చిత్రాల్లో నటించడం ఇష్టంలేదు' అని చెప్పకొచ్చింది. హిందీలో విజయవంతమైన 'క్వీన్‌' రీమేక్‌లో నటించే అవకాశం వచ్చినా.. ఈ ముద్దుగుమ్మ సున్నితంగా తిరస్కరించింది. ఎందుకని అడిగితే.. ఈ కారణం చెప్పుకొచ్చింది.

అయితే సమంత చాలా తెలివైందని ఈ విషయం విన్న వారు అంటున్నారు. హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తే కమర్షియల్ చిత్రాల్లో ఆఫర్స్ తగ్గుతాయని తెలుసు అని అంటున్నారు. తన ముందున్న హీరోయిన్స్ ఇలా హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలకు టెమ్ట్ అయ్యే...పెద్ద హీరోలతో సాగుతున్న తమ కెరీర్ ని ప్రక్క దారి పట్టించుకున్నారనే విషయం ఆమె గమనించి, సున్నితంగా రిజెక్టు చేసిందంటున్నారు.

why Samantha rejects Queen remake

'బాణా కాత్తాడి' చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైన నటి సమంత. ప్రస్తుతం కోలీవుడ్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ అయ్యారు. మహేష్‌బాబు, ఎన్టీఆర్‌, నాగచైతన్య.. ఇలా యువ హీరోలందరితోనూ ఆడిపాడుతోందీ ముద్దుగుమ్మ. చెన్నై నుంచి వెళ్లి టాలీవుడ్‌లో హవాచాటుతున్న ఈ అమ్మడుకు తమిళంలో మాత్రం ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. కానీ ఇప్పుడు వరుసగా అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి.

'అంజాన్‌'లో సూర్య సరసన, 'కత్తి'లో విజయ్‌ సరసన నటిస్తోంది ఈ సుందరి. అంతేకాక విక్రం నటించనున్న తాజా చిత్రంలోనూ సమంత ఎంపికైంది. తెలుగులో ఎన్టీఆర్‌ సరసన 'రభస'తో పాటు మరో రెండు సినిమాల్లో నటిస్తోంది. దీంతో కేవలం కమర్షియల్‌ చిత్రాలపై మాత్రమే దృష్టి పెడుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X