»   » రజనీకాంత్‌ గురించి నేనెందుకు స్పందించాలి?.. సినీ నటి గౌతమి షాకింగ్ కామెంట్

రజనీకాంత్‌ గురించి నేనెందుకు స్పందించాలి?.. సినీ నటి గౌతమి షాకింగ్ కామెంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై మాట్లాడటానికి సినీ నటి గౌతమి నిరాకరించారు. ఆయన పొలిటికల్ ఎంట్రీపై తాను స్పందించాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత తీవ్ర సంక్షోభంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీకి గౌతమి బాసటగా నిలిచారు. తాజాగా రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై ఆమె చేసిన కామెంట్ తీవ్ర చర్చనీయాంశమైంది. రజనీకి గౌతమి మద్దతు తెలియజేసే ప్రసక్తి లేదని అనే మాట రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నది.

యోగా మంచిది..

యోగా మంచిది..

తాజాగా గౌతమి మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్ని దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెరవేర్చారు. జయలలిత మరణం తర్వాత ఆమె ప్రవేశపెట్టిన పథకాల అమల్లో స్పష్టత లేదు. నేను కేన్సర్‌ వ్యాధితో బాధపడుతున్నప్పుడు యోగా చాలా ఉపయోగపడింది అని గౌతమి అన్నారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా చెన్నైలో నిర్వహించిన యోగా కార్యక్రమానికి ఆమె హాజరైంది.

నేను స్పందించను

నేను స్పందించను

రజనీకాంత్‌ రాజకీయ ప్రవేశంపై నేను స్పందించను. అవన్నీ ఊహాగానాలే. దినకరన్‌ వివాదంపై ప్రజలకు అంతా తెలుసు అని గౌతమి అన్నారు. కాగా జయలలిత చికిత్స, మరణంపై సందేహాలు వ్యక్తం చేసిన గౌతమి ఈ విషయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సైతం రెండు సార్లు లేఖలు రాసిన విషయం విదితమే.

ప్రభుత్వాలపై ఫైర్

ప్రభుత్వాలపై ఫైర్

దేశ, పౌరుల భద్రత, ఉద్యోగాలు, ఆరోగ్యం లాంటి అంశాలపై ప్రభుత్వాలు అనుసరిస్తున్న ధోరణిని గౌతమి ఇటీవల మీడియాలో స్పందించారు. ప్రజా సంక్షేమం విషయంలో ప్రభుత్వాలు తమ బాధ్యతను విస్మరిస్తున్నాయని, వాటిని సరైన మార్గంలో పెట్టి సాధించుకోవాల్సిన అవసరం ఉందని గౌతమి అన్నారు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరుతో ప్రజల జీవితం దుర్భరంగా మారిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

జోరుగా రజనీపై చర్చ

జోరుగా రజనీపై చర్చ

రజనీకాంత్‌ రాజకీయ అరంగ్రేటంపై తమిళనాడులో చర్చ జోరుగా సాగుతున్నది. తలైవా రాజకీయంగా అడుగులు వేయడానికి సిద్ధం అవుతున్నట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి. అందుకనుగుణంగా దేవుడు శాసిస్తే రాజకీయాల్లోకి రావడం తథ్యం అని ఇటీవల ఇండియా టుడే చానెల్‌తో మాట్లాడుతూ అన్నారు. అమ్మ జయలలిత మరణం తదుపరి తమిళనాట నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో రజనీ రాకకు ఇదే మంచి తరుణం అని ఆహ్వానించే వాళ్లు కొందరు అయితే, వ్యతిరేకించే వాళ్లూ అదే స్థాయిలో ఉన్నారు.

English summary
Actor Gautami is not keen to respond on Super Star Rajinikanth political Entry. She said why should i respond on it. What is the necessity we have. Furthru She said Governments are not playing correct role in society.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu