శ్రియకు అందుకే ఆఫర్స్ రావటం లేదు
తెలుగులో దాదాపుగా అగ్రహీరోలందరి సరసన నటించిన ఢిల్లీ భామ శ్రీయ ప్రస్తుతం గడ్డురోజులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసందే. రవితేజ నటించిన 'భగీరథ" చిత్రంతో తెలుగు చిత్రసీమకు టాటా చెప్పేసి తమిళ, హిందీ చిత్రాల్లో బిజీ అయిపోయిన శ్రీయ ఈ మధ్య ఆ రెండు భాషల్లోనూ పెద్దగా అవకాశాలు లేకపోవడంతో 'డాన్‌శీను" చిత్రంతో మళ్ళీ తెలుగులో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూసింది. కానీ ఆ చిత్రం తర్వాత కూడా ఆమెకు ఒక్క ఆఫరూ రాలేదు. దానికి కారణం శ్రీయ హీరోయిన్ గా సీనియర్ అయిపోవడం వల్లే తెలుగులో పెద్దగా అవకాశాలు రావడంలేదని, అందుకే యంగ్ హీరోలెవరూ శ్రీయతో నటించడానికి పెద్దగా ఆసక్తి చూపించడంలేదని చెప్తున్నారు. పోనీ చిన్న హీరోలు ప్రక్కన చేద్దామంటే ఆమె రెమ్యునేషన్ ని నిర్మాతలు తట్టుకోలేమని ఆగలేకపోతున్నారు.
ఆమెతో చేసిన సీనియర్ హీరోలు కూడా ఆమె అంటే ఆసక్తి చూపటం లేదు. వాళ్ళూ యంగ్ హీరోయిన్స్ నే కోరుకోవటం గమనార్హం. అదే ఆమె కెరీర్‌కు మైనస్‌గా మారిందని చెప్తున్నారు. ప్రస్తుతం అల్లరి నరేష్‌తో ఓ తెలుగు చిత్రంలో ఎట్టకేలకు నటించే అవకాశం దక్కించుకున్న శ్రీయ ఈ చిత్రంతో ఎలాగైనా తెలుగులో మళ్ళీ ఏపుంజుకోవాలని ప్రయత్నాలు చేస్తోందట.తమిళంలో జీవాతో 'రౌదిరం", మలయాళంలో మోహన్‌లాల్‌తో ' కాసనోవా" అలాగే సల్మాన్ రష్డీ వివాదాస్పద నవల 'మిడ్‌నైట్ చిల్డ్రన్స్"ఆధారంగా రూపొందుతున్న ఓ ఆంగ్ల చిత్రంలోనూ నటిస్తోంది. ప్రస్తుతం గల్లీ గల్లీ మే చోర్ హై అనే హిందీ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ భోపాల్‌లో జరుగుతోంది.


Click it and Unblock the Notifications











