శ్రియా కోపానికి కారణం అదే...
చెన్నై : తనతోపాటు మరో హీరోయిన్ ఉంటే ఆ సినిమాలో నటించబోనని చెబుతోంది శ్రియ. ఇటీవల అలాంటి సందర్భం చోటుచేసుకోవడంతో ఏకంగా చిత్రం నుంచే పక్కకు తప్పుకుందీ ముద్దుగుమ్మ. తమిళం, తెలుగులో అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో మలయాళం, కన్నడ చిత్రసీమలపై దృష్టి పెట్టింది శ్రియ. ఇటీవల మలయాళంలో 'కాసినోవా', 'పోక్కిరి రాజా'లో నటించింది. తాజాగా 'పెన్‌కుట్టి'లోనూ హీరోయిన్‌గా ఎంపికైంది.
ఈ విషయాన్ని దర్శకుడు ప్రకాశం పరతున్నా కూడా ప్రస్తావించారు. ఇందులో తాను నటించడం లేదని ప్రకటించింది శ్రియ. 'ప్రస్తుతం మలయాళంలో ఏ సినిమాలోనూ నటించడం లేదు. ఓ చిత్రం ఒప్పుకున్నట్లు వస్తున్న వార్తలన్నీ అబద్దం'మేనని పేర్కొంది. ఈ సినిమాలో రెండో హీరోయిన్ గా ఆండ్రియాను తీసుకున్నామని దర్శకుడు చెప్పారు. ఇదే శ్రియ కోపానికి కారణమని సమాచారం.
తెలుగులో ' ఇష్టం' చిత్రం ద్వారా ,తమిళ్ లో 'ఎనక్కు20 ఉనక్కు 18ఇష్టం' తో అడుగుపెట్టిన అందాలతార శ్రియ. ఆ తర్వాత వరస హిట్స్ తో దూసుకుపోయింది. తమిళంలో అయితే జయంరవితో 'వర్షం'లో తడిసి అక్కడి ప్రేక్షకాభిమానులను సొంతం చేసుకుంది. రజనీకాంత్‌తో 'శివాజి', ధనుష్‌తో 'తిరువిళయాడల్', విజయ్‌తో 'అళగియ తమిళ్‌మగన్' చిత్రాలు చేసి మంచిపేరు సంపాదించింది. హిందీ చిత్ర పరిశ్రమపై అమ్మడు దృష్టిపెట్టడంతో కోలీవుడ్‌లో క్రేజీ క్రమంగా తగ్గుముఖం పట్టింది. తిరిగి ఆ స్థాయికి చేరుకోవడానికి ఇప్పుడు ప్రయత్నిస్తోంది. కానీ అవకాశాలు మాత్రం దక్కలేదు. తాజాగా తెలుగులో అక్కినేని త్రయం నటిస్తున్న 'మనం', హిందీలో 'వాల్మీకి..'లో నటిస్తోంది.


Click it and Unblock the Notifications












