రజినీ-కమల్ మూవీకి బిగ్ షాక్... నా వల్ల కాదంటున్న డైరెక్టర్

సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth), లోక నాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) కలయికలో 'తలైవర్ 173'(Thalaivar173) అనే భారీ బడ్జెట్ మూవీను లాస్ట్ ఇయర్ నవంబర్ లో సినిమా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు డైరెక్టర్ సుందర్‌.సి దర్శకత్వం వహించబోతున్నారని ప్రకటించారు. ఈ సినిమాలో రజనీ హీరోగా నటిస్తే, రాజ్‌కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ పతాకంపై కమల్ నిర్మిస్తారని అర్థమైంది.

వచ్చే (2027) సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేశారు. దశాబ్దాల తర్వాత ఈ ఇద్దరు లెజెండ్స్ ఒకే స్క్రీన్‌పై కనిపించబోతుండటంతో ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ప్రకటన జరిగిన కొన్ని రోజులకే దర్శకుడు సుందర్ సీ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం షాక్‌కు గురిచేసింది. అయితే.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ విషయంపై స్పందించారు. ఇంతకీ ఏమన్నారు?

Why Sundar C Quit Thalaivar 173 Rajinikanth-Kamal Haasan Film Update

ప్రారంభంలో ఈ సినిమా కోసం పలువురు దర్శకుల పేర్లు వినిపించినప్పటికీ, చివరికి సుందర్ సి ఎంపిక కావడంతో ప్రాజెక్ట్‌ పై భారీ అంచనాలు పెరిగాయి. గతంలో రజనీకాంత్‌తో 'అరుణాచలం' వంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చిన అనుభవం ఉండటంతో, ఈ భారీ ప్రాజెక్ట్‌ను సమర్థంగా తెరకెక్కించగలుగుతాడనే నమ్మకం మేకర్స్‌కు ఉండేది. అయితే ప్రకటన వచ్చిన కొన్ని రోజులకే ఆయన ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం షాక్ కలిగించింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో డైరెక్టర్ సుందర్ సి తన నిర్ణయం వెనక ఉన్న అసలు కారణాలను వివరించారు.

డైరెక్టర్ సుందర్ సి మాట్లాడుతూ.. 'ఈ సినిమా చేయడం నాకు తీవ్రమైన ఒత్తిడిగా అనిపించింది. గత 16 ఏళ్లుగా నాకు నచ్చిన విధంగా సినిమాలు చేస్తున్నాను. కానీ ఇంత పెద్ద ప్రాజెక్ట్‌లో నా ఆలోచనలను అందరికీ వివరించి ఒప్పించడం నాకు కష్టమైంది' అని ఆయన తెలిపారు. కథను ప్రభావవంతంగా నేరేట్ చేయడంలో తనకు అంత బలంగా లేనని, అలాగే ఎవరైనా మార్పులు సూచిస్తే ఎక్కువగా వాదించకుండా రాజీ పడే స్వభావం తనదని ఆయన స్వయంగా అంగీకరించారు.

ఈ ప్రాజెక్ట్ పరిమాణం, స్టార్ పవర్ దృష్ట్యా ప్రతి నిర్ణయం ఎంతో కీలకమవుతుంది. రజనీకాంత్ కమర్షియల్ ఇమేజ్, కమల్ హాసన్ టెక్నికల్ స్టాండర్డ్స్ ఈ రెండింటినీ సమతుల్యం చేయడం చిన్న విషయం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో తన వ్యక్తిగత నిర్ణయాలకు తావు ఉండదని, సినిమా మొత్తం అనేకమంది ఆలోచనల కలయికగా మారుతుందని సుందర్ సి గ్రహించారు. "నేను ఈ సినిమాకు పూర్తి న్యాయం చేయలేనని అనిపించింది. అందుకే ప్రారంభ దశలోనే తప్పుకోవడం మంచిదని భావించాను" అని ఆయన స్పష్టం చేశారు. సినిమా పరిశ్రమలో ఇంత పెద్ద అవకాశాన్ని వదులుకోవడం సాధారణ విషయం కాదు. కానీ, సుందర్ సి తీసుకున్న ఈ నిర్ణయం వృత్తిపరమైన నిజాయితీకి నిదర్శనంగా పలువురు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఒక ప్రాజెక్ట్‌కు న్యాయం చేయలేనని ముందుగానే అర్థం చేసుకుని వెనక్కి తగ్గడం, దీర్ఘకాలంలో సినిమా నాణ్యతకు కూడా ఉపయోగపడుతుందని వారు అంటున్నారు. ఇక సుందర్ సి తప్పుకున్న తర్వాత, ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు సిబీ చక్రవర్తి (Sibi Chakravarthi) కి అప్పగించబడినట్లు సమాచారం. 'డాన్' వంటి సినిమాతో గుర్తింపు పొందిన శిబి చక్రవర్తి, ఈ భారీ ప్రాజెక్ట్‌ను ఎలా హ్యాండిల్ చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మధ్యలో ఆయన కూడా తప్పుకుంటున్నారన్న రూమర్స్ వినిపించినా, అవి నిజం కాదని తేలింది.

మరోవైపు, ఈ సినిమాను రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషన్ బ్యానర్‌పై జరుగుతోంది. కమల్ హాసన్ స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమా 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. భారీ బడ్జెట్, అగ్రతారల కలయిక, పాన్ ఇండియా అంచనాలు అన్ని కలిసి ఈ సినిమాని ఇండియన్ సినిమా హిస్టరీలో ప్రత్యేక స్థానం దక్కేలా చేస్తున్నాయి. ఇక రజనీకాంత్ - కమల్ హాసన్ వంటి లెజెండ్స్‌ను ఒకే తెరపై చూపించడం ఎంత పెద్ద అవకాశమో, అంతే పెద్ద బాధ్యత కూడా అని సుందర్ సి నిర్ణయం స్పష్టంగా చూపించింది. ఆయన తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇక ఈ ప్రాజెక్ట్ ఎలా రూపుదిద్దుకుంటుందో, ప్రేక్షకుల అంచనాలను ఎంతవరకు అందుకుంటుందో చూడాలి.

Read more about: sundar c rajinikanth kamal haasan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X