అనుష్కకి వయస్సు ,అనుభవం ఉన్నాయి: తమన్నా
అరుంధతి లాంటి సినిమాలు చేయటానికి వయసుతో పాటు అనుభవం కూడా అవసరం. ఎలా పడితే అలా,ఎవరు పడితే వారు చేయకూడదు. భవిష్యత్తులో తప్పకుండా అలాంటి చేస్తా. ప్రస్తుతం నా వయసుకు తగ్గట్టు..ఇలా గ్లామర్‌గా చేసుకుంటూ పోనియండీ...అంటోంది తమన్నా. తమిళంలో తనకు పోటీగా ఎదుగుతున్న అనుష్కని ఉద్దేశ్శించి తమన్నా అన్న మాటలు విన్నవారు నవ్వుకుంటున్నారు. సింగం హిట్ తో అనుష్క అక్కడ కూడా పాగా వేసింది. అయితే ఇప్పటివరకూ తనకు ఎదురేలేకుండా దూసుకుపోతున్న తమన్నాకు ఇది జీర్ణించుకోలని విషయమే. దాంతో అనుష్కకి వయస్సు ఉందని తాను మాత్ర క్యూట్ గా ఉండే చిన్న పిల్లనని, తను గ్లామర్ పాత్రలు ప్రత్యేకంగా చేస్తానని ఇలా ఇండైరక్ట్ గా చెప్తోంది. ఇక తమన్నా తెలుగులో వివి వినాయిక్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా చేసే బద్రీనాధ్ లోనూ, నాగచైతన్య, సుకుమార్ కాంబినేషన్లో రూపొందే చిత్రంలోనూ నటిస్తోంది.
అనుష్క తమన్నా సింగం హ్యాపీడేస్ నాగచైతన్య అల్లు అర్జున్ బద్రీనాధ్ సుకుమార్ వివి వినాయిక్ tamanna anushka singam happy days naga chaitanya allu arjun badrinath sukumar


Click it and Unblock the Notifications