Trisha: తమిళ రాజకీయాల్లో త్రిష చిచ్చు.. దళపతి విజయ్‌తో అలాంటి భయమా?
తమిళనాడు రాజకీయాల్లోను, సినీ పరిశ్రమలోను దళపతి విజయ్ వ్యవహారం రోజుకో సంచలనంగా మారుతున్నది. టీవీకే పార్టీని స్థాపించి జనంలోకి వెళ్తున్న ఆయనపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. అలాగే ఆయన నటించిన జన నాయగన్ చిత్రం గత నెల రోజులుగా సెన్సార్ బోర్డు వద్ద వివాదంలో చిక్కుకొన్నది. దాంతో అన్ని రకాల వార్తలు విజయ్ చుట్టే తిరుగుతున్నాయి. గత మాసం రోజులుగా విజయ్ పాలిటిక్స్‌లోను, ఫిల్మ్ ఇండస్ట్రీలోను సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్‌గా మారారు. అయితే తాజాగా విజయ్‌కి తోడుగా త్రిష కూడా రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారింది. తాజాగా తమిళనాడు బిజేపీ నేత నైనార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. ఈ సరికొత్త వివాదానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..
తమిళ సినీ పరిశ్రమలో కొద్ది సంవత్సరాలుగా స్టార్ హీరో విజయ్, తమిళ స్టార్ హీరోయిన్ త్రిషా కృష్ణన్ మధ్య అఫైర్ వార్తలు మీడియాలో గుప్పుమన్నాయి. విజయ్‌తో కలిసి త్రిష దిగిన సెల్పీ వైరల్ కావడంతో వారిద్దరి మధ్య సహ నటుల బంధం కంటే ఏదో రిలేషన్ ఉందనే విషయంపై ఊహాగానాలు వచ్చాయి. దాంతో వారిద్దరి డేటింగ్ వ్యవహారం మీడియాకు హాట్ టాపిక్‌గా మారింది. అయితే తమపై వస్తున్న వార్తలకు అటు త్రిష గానీ, విజయ్ నుంచి గానీ ఎలాంటి స్పందన రాకపోవడం మరింత క్యూరియాసిటీని పెంచింది.

అయితే విజయ్ తమిళనాడు రాజకీయాల్లో ఫుల్ టైమ్ పొలిటిషన్‌గా మారిన తర్వాత ఆయను అన్ని రకాలుగా టార్గెట్ చేస్తూ వస్తున్నారు. అయినా విజయ్ తమ విశ్వాసాన్ని, నమ్మకాన్ని చెక్కు చెదరకుండా ముందుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో బిజేపీ నేత నాగేంద్రన్ తాజాగా టీవీకే అధినేతపై విరుచుకుపడ్డారు. పాలిటిక్స్‌లో ఆయనకు అనుభవం లేదు అని విమర్శించారు.
నాగేంద్రన్ మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయాల్లో ఆయన పూర్ లీడర్. అసలు అనుభవమే లేదు. ముందు ఆయన త్రిషా ఇంటి నుంచి బయటకు రావాలి. ఆ తర్వాతే ఆయన రాజకీయంగా ఏదైనా సాధించగలడు. ఆయన సొంత కుటుంబంతో సరైన బంధాన్ని కొనసాగించాలి. అప్పుడే గొప్ప నేతగా మారే అవకాశం ఉంది. తమ నాయకులతో సరిగా కమ్యూనికేట్ చేయగలుగుతాడు అని అన్నాడు. ఈ వ్యాఖ్యలు అత్యంత వివాదాస్పదంగా మారడమే కాకుండా తమిళనాడు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి. సొంత పార్టీ నుంచే ఆయనకు ఎదురు దాడి వచ్చింది.
నాగేంద్రన్ కుమార్ వ్యాఖ్యలను టీవీకే నేత నిర్మల్ కుమార్ తీవ్రంగా ఖండించారు. ఆయన దుర్మార్గమైన రాజకీయ నేత. ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరం. అనాగరికమైన తీరుతో మాట్లాడారు. ఓటమి భయంతోనే వారు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అని ఘాటుగా స్పందించారు. ఇక డీఎంకే నేత కణిమొళి కూడా బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలను ఖండించారు. త్రిష గురించి బీజేపీ నేత ఎందుకు మాట్లాడుతున్నారు. కేంద్రంలో వారు అధికారంలో ఉన్నారు. అభివృద్ది గురించి మాట్లాడకుండా ఇదేం పద్దతి. వ్యక్తిగత జీవితం గురించి విమర్శలు చేయొద్దు అని కాంగ్రెస్ నేత నిప్పులు చెరిగారు.
త్వరలోనే తమిళనాడులో ఎన్నికల జరుగనున్న సమయంలో రాజకీయాల్లో త్రిషా పేరు సెంటర్ ఆఫ్ కాంట్రవర్సీగా మారడం.. అనవసరంగా ఆమెను రాజకీయాల్లోకి లాగడం రగడ జరుగుతున్నది. ఈ వ్యవహారంపై త్రిష గానీ, విజయ్ గానీ ఎలాంటి సందర్భంలోనైనా స్పందిస్తారా? అనే విషయంపై సినీ, రాజకీయ, అభిమాన వర్గాలు దృష్టిపెట్టాయి. అయితే రాజకీయాల్లోకి త్రిషాను అనవసరంగా లాగుతున్నారా? అనే వాదన తెరపైకి వచ్చింది.


Click it and Unblock the Notifications











