నిన్న త్రిష.. నేడు నివేతా పేతురాజ్.. రేపు ఎవరు? హీరోయిన్ల చేదు అనుభవాలకు కారణాలేంటి?

తమిళ సినీ పరిశ్రమలో హీరోయిన్లను టార్గెట్‌గా చేసుకొని కొందరు దారుణమైన కామెంట్లు చేయడం అత్యంత దిగ్బ్రాంతికరమైన అంశాలుగా మారాయి. కొద్ది రోజుల క్రితం త్రిషను టార్గెట్ చేసుకొని నటుడు మన్సూర్ ఆలీ ఖాన్, తమిళ రాజకీయ వేత్త కామెంట్స్ చేయడం సంచలనం రేపింది. ఆ ఘటన మరచిపోకముందే నివేతా థామస్‌ను టార్గెట్ చేసుకొని ఓ సినీ, రాజకీయ విశ్లేషకుడు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడం మరింత సంచలనం రేపింది. ఇలాంి వరుస సంఘటనలతో రేపటి రోజున ఏ హీరోయిన్ పేరు బయటకు వస్తుందనే విషయం చర్చనీయాంశమైంది. ఈ సంఘటనలకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

త్రిష గురించి నటుడు మన్సూర్ ఆలీ ఖాన్ మాట్లాడుతూ.. విజయ్ నటించిన సినిమాలో త్రిష నటిస్తుందని తెలిసింది. అయితే ఆమెతో నాకు బెడ్ రూమ్ సీన్లు కానీ, లేదా రేప్ సీన్ ఉంటుందని ఆశపడ్డాను. కానీ నేను అనుకొన్నట్టు ఒక్క రేప్ సీన్, పడక గది సీన్ లభించలేదు. దాంతో నేను నిరాశపడ్డాను అంటూ మన్సూర్ ఖాన్ చెప్పడం సంచలనం రేపింది. ఈ వ్యవహారంలో కామెంట్లు చేసిన మన్సూర్ ఆలీ ఖాన్‌కు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.

Why Trisha Krishnan Nivetha Pethuraj personally Targetted In Tamil Film Industry Who is the next star

ఇక మన్సూర్ అలీ ఖాన్ ఉదంతం మరవక ముందే.. త్రిషను టార్గెట్ చేస్తూ ఏఐడీఎంకే నేత ఏవీ రాజు మరో సంచలన వ్యాఖ్యలు చేశారు. జయలలిత మరణం తర్వాత పార్టీ రెండుగా చీలిపోయింది. శశికళ, పన్నీరుసెల్వం క్యాంపు రాజకీయాలు నిర్వహించారు. ఆ సమయంలో ఓ ఎమ్మెల్యే నాకు త్రిష కావాలని అడిగారు. దాదాపు 25 లక్షల రూపాయలు ఇచ్చి ఆమెను రిసార్టుకు రప్పించారు. త్రిషనే కాదు.. ఆ సమయంలో చాలా మంది హీరోయిన్లు, సీరియల్ యాక్టర్లను కూడా తరలించారు అని ఆయన వ్యాఖ్యలు చేయడం మీడియాలో దుమారంగా మారింది. త్రిషపై వ్యాఖ్యలు చేసిన మన్సూర్ ఆలీ ఖాన్, ఏవీ రాజు ఆ తర్వాత క్షమాపణలు చెప్పారు.

ఇక తాజగా తమిళ మీడియాలో రాజకీయ, సినీ విశ్లేషకుడు సువుక్కు శంకర్ ఇటీవల ఓ మీడియా ఇంటర్వ్యూలో నివేతా పేతురాజ్, ఉదయనిధి స్టాలిన్ సంబంధంపై బాంబు పేల్చాడు. నివేతా పేతురాజ్‌కు దుబాయ్‌లోని అత్యంత ఖరీదైనా ప్రాంతంలో లూలూ మాల్ అధినేత ఇంటికి పక్కనే 50 కోట్ల రూపాయల విలువైన ఇంటిని కొనిచ్చారు అని అన్నారు. దాంతో ఆయన వ్యాఖ్యలు, వీడియో ట్రెండ్ అవుతూ వచ్చాయి.

Why Trisha Krishnan Nivetha Pethuraj personally Targetted In Tamil Film Industry Who is the next star

అయితే సువుక్కు శంకర్ చేసిన వ్యాఖ్యలపై హీరోయిన్ నివేతా పేతురాజ్ ఆవేదన వ్యక్తం చేస్తూ ట్విట్టర్‌లో ఓ పోస్టు పెట్టారు. తాను గౌరవప్రదమైన కుటుంబానికి చెందిన అమ్మాయిని. అలాంటి ఫ్యామిలీని, ఆ కుటుంబ నుంచి వచ్చిన మహిళ జీవితాన్ని నాశనం చేయవద్దు అని ట్విట్టర్‌లో రిక్వెస్ట్ చేశారు. అవాస్తవాలను ప్రచారం చేయవద్దని మీడియాను కోరారు.

తమిళనాట త్రిష, నివేతా పేతురాజ్ సంఘటనలు సోషల్ మీడియాలో ఓ వర్గాన్ని తీవ్రంగా కలిచి వేస్తున్నాయి. శంకర్ లాంటి వ్యక్తులను విడిచిపెట్టవద్దు. ఆయనపై పరువునష్టం దావా వేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తులను ఇలా విడిచి పెడితే.. మరోక తార బలి కావాల్సి వస్తుంది. అలాంటి జరగకూడదంటే.. ఇలాంటి వ్యక్తులకు బుద్ది చెప్పాల్సిందే అనే డిమాండ్ వినిపిస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X