మహేష్, పవన్ ల వల్లే విక్రమ్ సినిమా ఆగిపోయింది
మణిరత్నం దర్శకత్వంలో 'విలన్' చిత్రం విడుదల కాకమునుపే విక్రమ్ 'ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే' దర్శకుడు సెల్వ రాఘవన్ రూపొందిస్తున్న పేరు పెట్టని చిత్రంలో విక్రమ్ నటించటం ప్రారంభించాడు. 'కొమరం పులి', 'మహేష్ ఖలేజా' చిత్రాల నిర్మాత సింగనమల రమేష్ కనకరత్న మూవీస్‌పై రూపొందుతున్న ఆ చిత్రం సైకో థ్రిల్లర్ ఇతివృత్తాన్ని కలిగి ఉందని సమాచారం. ఆ చిత్రం తాలూకు మొదటి షెడ్యూల్ లడఖ్ లో జరిగింది. కానీ అంతుబట్టని కారణాలతో ఆ చిత్రం షూటింగ్ అర్థంతరంగా ఆగిపోయింది. అయితే ఇలా ఆగిపోవటానికి కారణం..మహేష్ ఖలేజా, కొమరం పులి అనుకున్న టైమ్ కి పూర్తి కాకపోవటమేనని విక్రమ్ కి చెప్పారుట. దాంతో తన డబ్బు మొత్తం బ్లాక్ అయిపోయిందనీ, అవి సకాలంలో అనుకున్న టైమ్ కి పూర్తయితే చిత్రం కంటిన్యూ చేసేవాడినని నిర్మాత సింగనమల రమేష్ తెలిపినట్లు తమిళ మీడియా చెప్తోంది. దాంతో విక్రమ్, సెల్వ రాఘవన్ ఈ చిత్రం ఎందుకు ఆగిపోయిందని మీడియా వారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నారుట. ఇక ప్రస్తుతం విక్రమ్..'మదరాసు పట్టణం' దర్శకుడు విజయ్ దర్శకత్వంలో నటించేందుకు సంతకం చేశాడు.


Click it and Unblock the Notifications











